• ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాల సేకరణ
  • 2018-19లో టీఆర్‌ఎస్‌ ఆదాయం 188 కోట్లు
  • వైసీపీ ఆదాయం 181 కోట్లు.. ఖర్చులో ఫస్ట్‌
  • ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి : దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయ వివరాలకు సంబంధించిన నివేదికలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ఆదాయం ఉన్న పార్టీలుగా టీఆర్‌ఎస్‌, వైఎ్‌సఆర్‌సీపీ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. పోయిన ఆర్థిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌ మొత్తం ఆదాయం రూ. 188 కోట్లని ఆ పార్టీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. వీటిలో రూ. 141 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలుగా వచ్చాయని తెలిపింది. అదే సమయంలో ఎన్నికల ప్రచారం, తదితరాల కోసం రూ. 29.72 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

ఇక ప్రచార వ్యయం పరంగా చూస్తే వైసీపీ దక్షిణాదిలోనే టాప్‌గా నిలిచింది. ఆ పార్టీ 2018-19లో ఎన్నికల కోసం రూ. 87.68 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ మొత్తం ఆదాయం రూ. 181 కోట్లు కాగా, అందులో రూ. 99.84 కోట్లను విరాళాల ద్వారా సేకరించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే రెండు పార్టీల ఆదాయంలో భారీ పెరుగుదల కనిపించింది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో జేడీఎస్‌ ఆదాయం రూ. 42.89 కోట్లు కాగా, ఏఐఏడీఎంకే ఆదాయం రూ. 28.10 కోట్లు అని ఆయా పార్టీలు తమ తమ అఫిడవిట్లలో పేర్కొన్నాయి.