• అధికారుల అభ్యంతరం.. 
  • హరియాణాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు చేదు అనుభవం

న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు వారి వైపు ఓ లుక్కేసి ‘మీ ముఖాలు చూస్తే నేపాలీల్లా కనిపిస్తున్నారు’ అంటూ తిరస్కరించారు. హరియాణాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. భగత్‌ బహదూర్‌ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు సంతోష్‌, హెన్నాలతో చండీగఢ్‌లోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. వారి ముఖాలు చూసిన అధికారులు నేపాలీల్లా కనిపిస్తున్నారంటూ ‘మీ జాతీయతను రుజువు చేసుకోండి’ అన్నారు. వారి దరఖాస్తు పత్రాలపై అదే రాశారు. బాధితులు రాష్ట్ర మంత్రి అనిల్‌ విజ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. హరియాణా డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌ శర్మ స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే సంతోష్‌, హెన్నాలకు పాస్‌పోర్టులు అందుతాయని వివరణ ఇచ్చారు.

(Courtesy Andhrajyothi)