తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ ఖాళీలను భర్తీచేయడం, జీతభత్యాల సవరణ, కొత్త బస్సుల కొనుగోలు, ఇతర డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ రవాణ వ్యవస్థలో ప్రమాదాలలో ప్రజల ప్రాణాలు కోల్పోతుండడం ఒక విషాదం. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ కార్మికులు బతుకులను చాలిస్తుండడం తెలంగాణ సమాజానికి అనారోగ్యకరం. హైకోర్టు చూపిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం సత్వరం చర్చలు జరిపి కార్మికులకు, ప్రజారవాణా వ్యవస్థకు సరైన న్యాయం, పటిష్టత చేకుర్చాలని విన్నవిస్తున్నాం. తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాం.
– కె.శివారెడ్డి, దేవిప్రియ, నిఖిలేశ్వర్, గోరేటి వెంకన్న, విమలక్క, అల్లం రాజయ్య, సిద్ధార్థ, భూపతి వెంకటేశ్వర్లు, అరవింద్, హరగోపాల్, జయధీర్ తిరు మలరావు, కాశీం, కాత్యాయని విద్మహే, పద్మజా షా, సూరేపల్లి సుజాత, సమున్నత, అక్బర్, నర్సిం, కొండేపూడి నిర్మల, జూపాక సుభద్ర, విమల, శిలాలోలిత, గీతాంజలి, వరలక్ష్మి, మెర్సీ మార్గరెట్, దాసోజు లలిత, నస్రిన్ ఖాన్, శోభ భట్, ఆలూరి కవిని, మాభూమి సంధ్య, శివలక్ష్మి, నల్లూరి రుక్మిణి, అమ్రపాలి, సజయ, కొండవీటి సత్యవతి, రమా సుందరి,

స్వర్ణలత, పసునూరి రవిందర్, యాకూబ్, అన్వర్, వాసిరెడ్డి నవీన్, కాసుల ప్రతాపరెడ్డి, కె.ఆనందాచారి, అన్నవరం దేవెందర్, బమ్మిడి జగదీశ్వర్ రావు, వాహెద్ ఖాన్, ఖాజ మొహినుద్దిన్, వల్లభాపురం జనార్దన్, తంగిరాల చక్రవర్తి, బెల్లి యాదయ్య, కస్తూరి ప్రభాకర్, వేనెపల్లి పాండురంగారావు, జుగాష్ విలి, ఏకె ప్రభాకర్, నరేష్ సూఫీ, విజయ్ సాధు, అరుణాంక్ లత, శేషు కొర్లపాటి, ఛాయ మోహన్ బాబు, ఆర్.కె., కె.బాల్ రెడ్డి, పి.మోహన్, వేల్పుల నారాయణ, పాపాని నాగరాజు, కపిల రాంకుమార్‌, మల్లీశ్వరి.. తదితరులు.

Courtesy Andhra Jyothy