కనీస వేతనాల అమలు పట్టింపేది?: నాయిని

చిక్కడపల్లి/హైదరాబాద్‌ : తెలంగాణలో సమ్మె చేయాలంటే కార్మికులు భయపడుతున్నారని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల అమలు విషయాన్ని కార్మికశాఖ మంత్రి పట్టించుకోవడం లేదని.. ఇది బాధాకరమని అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ‘‘75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించేలా ఏపీ సర్కారు చట్టం చేసింది. మన రాష్ట్రంలో కూడా ప్రైవేటు రంగంలో అలాంటి చట్టం రావాలి’’ అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి, రచయిత, కవి గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

(Courtesy Andhrajyorthi)