Image result for modi shah nitish kumar"– కేంద్రానికి నితీశ్‌కుమార్‌ షాక్‌

పాట్నా: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ‘పౌర’ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించిన బీజేపీ మిత్ర పక్షం జేడీయూ అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయబోమని కేంద్రానికి షాకిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనార్టీలు, ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు బీహార్‌లో ఎన్నార్సీని అమలు చేయాల్సిన అవసరమేముందని కేంద్రాన్ని నితీశ్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ గతవారం రోజులుగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం, ఎన్నార్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష ఆర్జేడీ, వామపక్షాలు సహా లక్షలాది మంది ప్రజలు సమ్మెలు, ధర్నాలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లో ఎన్నార్సీని అమలు చేయడానికి తాను ఒప్పుకోననీ, అలాగే సీఏఏను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా నని తెలిపారు. బీహార్‌ జనాభాలో 17 శాతం ఉన్న మైనారిటీల మనోభావాలను గౌరవిస్తామని అన్నారు. జాతీయ ప్రతినిధి పవన్‌ వర్మ, పార్టీ ఎమ్మెల్సీ గులాం రసూల్‌ బుల్యావితో సహా ఇతరులు నాయకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిసున్నారని తెలిపారు. అలాగే, తమకు పార్టీ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమనీ, వివాదాస్ప ద పౌరసత్వ చట్టానికి, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పోరాడు తామని జేడీయూ ఎమ్మెల్యే ముజాహిద్‌ ఆల్కం తెలిపారు. ఈ మేరకు నితీశ్‌ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తున్నది.

(Courtesy Nava Telangana)