• అయోధ్య భూమిపై హక్కు వదులుకోం.. కోర్టు వెలుపల పరిష్కారం కుదరదు
  • మధ్యవర్తిత్వ చర్చల్లో మేం ఒప్పుకోలేదు
  • ఐదుగురు ముస్లిం కక్షిదారుల ప్రకటన

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై హక్కు వదులుకునేది లేదని ముస్లిం సంస్థలు తేల్చి చెప్పాయి. సున్నీ వక్ఫ్‌బోర్డు మినహా ఇతర ముస్లిం కక్షిదారులెవరూ కోర్టు వెలువల పరిష్కారానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశాయి. ‘‘కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా దేశంలోని అన్ని మసీదులకు చట్టబద్ధ రక్షణనివ్వాలి. ఈ మేరకు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పురావస్తు శాఖ అధీనం లో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు జరుపుకొనేందు కు అనుమతివ్వాలి. బాబ్రీకి ప్రతిగా ఓపెద్ద మసీదును అయోధ్యలోనే వేరే చోట కట్టుకునేందుకు అనుమతివ్వాలి. అయోధ్యలో 22 పాత మసీదుల మరమ్మతుకు సహకరించాలి. ఈ మూడు షరతులకు అంగీకరిస్తే అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై హక్కు వదులుకుంటాం’’ అని సున్నీ వక్ఫ్‌బోర్డు అంగీకరించింది. అయోధ్య కేసులో వాదనలు ముగిసిన రోజునే… అంటే, బుధవారం ఈ విషయం బయటికి వచ్చింది.

ఈ వార్త సంచలనం సృష్టించింది. దీనిపై శుక్రవారం ముస్లిం కక్షిదారుల తరఫున వాదించిన ఐదుగురు లాయర్లు స్పందించారు. సున్నీ వక్ప్‌బోర్డు నిర్ణయంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. మధ్యవర్తులతో జరిగిన చర్చలను ఉద్దేశపూర్వకంగా ‘లీక్‌’ చేశారని ఆరోపించారు. ‘‘సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తుల కమిటీ వద్ద జరిగిన చర్చల్లో సున్నీ బోర్డు మాత్రమే కోర్టు వెలుపల చర్చల ద్వారా పరిష్కారానికి అంగీకరించింది. మిగిలిన ముస్లిం కక్షిదారులు ఇం దుకు ఒప్పుకోలేదు. ఈ చర్చల్లో ప్రధాన హిందూ కక్షిదారులెవరూ పాల్గొనకపోవడమే దీనికి కారణం’’ అన్నారు.

 

అయో ద్య వివాదంపై సుప్రీంలో వాదనలు ముగుస్తున్న రోజునే… ‘అయోధ్యపై హక్కు వదులుకుంటున్నాం’ అంటూ ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చారని ఆరోపించారు. దీని వెనుక… మధ్యవర్తి కమిటీ సభ్యుడైన సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచూ, సున్నీ బోర్డు చైర్మన్‌ జాఫర్‌ అహ్మద్‌ ఫరూకీ లేదా నిర్మాణ అఖాడా ఉండొచ్చని అనుమానించారు. కాగా, అయోధ్య కేసులో సుప్రీం తీర్పు హిందువులకే అనుకూలంగా ఉంటుం దన్న ఆశాభావాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తం చేసింది.

Courtesy Andhra jyothy