• 60కి పైగా మునిసిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ
  • కార్పొరేషన్లలోనూ స్వల్ప వ్యత్యాసమే

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 120 మునిసిపాలిటీలు ఉన్నాయి. వాటిలో 60కి పైగా మునిసిపాలిటీల్లో అభ్యర్థులు విజయం సాధించాలంటే మహిళా ఓటర్లు కరుణించాల్సిందే. ఆయా మునిసిపాలిటీల్లో వారి సంఖ్య పురుషుల కంటే ఎక్కువ. దీంతో అభ్యర్థుల గెలుపు వారి చేతిలోనే ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల్లో సగం స్థానాలు రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు కేటాయిస్తారు. జనరల్‌ స్థానాల్లో గెలిచే వారిలో కూడా సగానికి పైగా మహిళలే ఉంటారు.

అయితే, కార్పోరేషన్లలో పరిస్థితి మాత్రం దీనికి కొద్దిగా భిన్నంగా ఉంది. నిజామాబాద్‌ కార్పోరేషన్‌ మినహాయిస్తే.. మిగతా అన్ని కార్పోరేషన్లలో పురుష ఓటర్లు కాస్త ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మునిసిపాలిటీ లు, కార్పోరేషన్‌లన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే.. పురుష, మహిళా ఓటర్ల సంఖ్య మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. మొత్తం 53,36,605 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు-26,71,694, మహిళలు-26,64,557, ఇతరులు-354 మంది ఉన్నారు.

(Courtesy Andhrajyothi)