సమాజంలో ప్రతి మహిళపైనా ప్రభావం
వివాహం, విద్య, వైద్యం, ఆర్థికం.. అన్నింటా వివక్షే : ఐరాస
ఆసియా-పసిఫిక్‌ లో 73శాతం మహిళలే..

న్యూఢిల్లీ : బలవంతపు పెండ్లి, పనిలోకి పంపటం, విద్య, వైద్య అందుకోవటంలో వివక్ష, చిన్నచూపు మొదలైనవాటిని మహిళలెంతోమంది ఎదుర్కొంటున్నారనీ, నేటి ప్రపంచం లో ప్రతి మహిళా ఆధునిక బానిసత్వానికి గురవుతున్నదని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి తేల్చింది. ప్రతి 130 మందిలో ఒక మహిళ ‘ఆధునిక బానిసత్వం’లో బతుకు వెళ్ల దీస్తోందని నివేదిక పేర్కొన్నది. బలవంతపు లైంగికచర్యలో 99శాతం మంది, బలవంతపు వివాహాల్లో 84శాతం, బల వంతంగా పనికి పంపటంలో 58శాతం మంది మహిళలు బాధితులుగా ఉన్నారని ఈనివేదికలో తెలిపారు. అనేక దేశా ల్లో విద్య, వైద్యం పొందటంలో మహిళలపై వివక్ష కొనసాగు తున్నదనీ, దాంతో పేదరికం నుంచి బయటపడటం మహిళలకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఐరాస నివేదికలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐదింట నాలుగు ప్రాంతాల్లో వివక్షప్రపంచాన్ని ఐదు ప్రాంతాలుగా విడగొట్టగా, నాలుగు ప్రాంతాల్లో మహిళలు ఆధునిక బానిసత్వంలో బతుకుతు న్నారు. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో 73శాతం, ఆఫ్రికాలో 71శాతం, యూరప్‌, మధ్యఆసియాలో 67శాతం, అమెరికాలో 63శాతం మహిళ లు బాధితులుగా ఉన్నారు. పేదరికం సమస్యతో బాధపడేవారిలో అత్య ధికం మహిళలే ఉంటున్నారు. దాంతో అత్యంత ప్రమాదకరమై న పను లను ఎంచుకోవాల్సి వస్తోంది. అసంఘటితరంగంలో అత్యంత రిస్క్‌తో కూడిన ఉద్యోగాలు పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు.

అరబ్‌ దేశాల్లో అత్యధికం : అరబ్‌ దేశాల్లో బలవంతపు వివాహాలు, బలవంతంగా ఇంటి పని చేయించడం ఎక్కువగా ఉందని నివేదిక అంచనావేసింది. మొత్తం జనాభాలో 40శాతం ఆధునిక బానిసత్వంలో బతుకుతుండగా, వీరం తా కూడా మహిళలే అన్న సంగతి తేలింది. మహిళలు ఆధునిక బాని సత్వంలోకి కూరుకుపోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఐరాస నివేదిక సూచించింది. ‘ఆధునిక బానిసత్వా’నికి వ్యతిరేకంగా పోరాడ టమంటే.. ప్రతి ఒక్కరికీ మానవ హక్కులు, స్వేచ్ఛను కల్పించటమేనని ఐరాస తెలిపింది. ఆధునిక బానిసత్వాన్ని పారదోలాలంటే, ఆదర్శవం తమైన నాయకత్వం, వ్యాపార వర్గాలు దేశవిదేశాల్లోని ఎన్జీఓ సంస్థలతో కలిసిపనిచేయాలని ఐరాససూచించింది. వివక్ష, లైంగికదాడులు, బల వంతం వంటి చర్యల్ని క్రిమినల్‌నేరాలుగా పరిగణించాల్సి ఉంటుందనీ, ఇందుకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తేవాలని ఐరాస తెలిపింది.

ఏం చేయాలి? : మహిళలకు ఆస్తి హక్కు కల్పించాలి, బాల వివాహా లను నిరోధించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలి, బాలికలకు ఉచిత విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలి, సంక్షోభ సమయంలో రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలి, లైంగికవేధింపుల నిరోధానికి పనిప్రదేశాల్లో కమిటీలను ఏర్పాటుచేయాలి.

Courtesy Nava Telangana