– మంచానికి కట్టేసి.. మహిళ సజీవ దహనం
– యాసిడ్‌పోసి మరో యువతిని..

లక్నో : యూపీలో అతి క్రూర ఘటనలు వెలుగుచూశాయి. ఓ మహిళను మంచానికి కట్టేసి సజీవ దహనానికి పాల్పడ్డారు. పశ్చిమ యూపీలోని బిజూనర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఆమె శరీరం పూర్తిగా కాలిపోయిందనీ, గుర్తించటానికి కూడా వీలులేకుండా ఉందని పోలీసులు తెలిపారు. గజ్రోలా అనే గ్రామంలోని శివార్లలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెపై కిరోసిన్‌ పోసి తగులబెట్టటమేకాదు.. ఆమెపై కాల్పులు కూడా జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని.. బాధితురాలిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమెను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నట్టు సీనియన్‌ పోలీసు అధికారి లక్ష్మీ నివాస్‌ మిశ్రా తెలిపారు. హత్యకు ముందు ఆమెపై లైంగికదాడి జరిగివుండచ్చనని అనుమానం వ్యక్తంచేశారు.

బహ్రెయిచ్‌ జిల్లాలో మరో యువతి
పశ్చిమ యూపీలోని అటవీ ప్రాంత సమీపంలో మరో యువతి మృతదేహం లభ్యమైంది. యాసిడ్‌ పోయటంతో ఆమె ముఖం చాలా భాగం కాలిపోయినట్టు పోలీసులు తెలి పారు. అయితే గుర్తించగలిగేలా వుందని అన్నారు. ఆమె వయ సు 18 నుంచి 20 ఏండ్ల మధ్య ఉంటుందని అన్నారు. ఆమెను దుండగలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడివుంటారని బహ్రెయిచ్‌ అడిషనల్‌ ఎస్పీ రవీంద్ర సింగ్‌ చెప్పారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆపై హత్య చేసివుంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు.

(Courtesy Nava Telangana)