వన్యప్రాణి సంరక్షణ మండలి ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్‌ : నల్లమలలో యురేనియం సర్వే, అన్వేషణ కోసం అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌(ఏఎండీ) చేసిన తాజా ప్రతిపాదనలను రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి(టీఎ్‌సడబ్య్లూబీ) తిరస్కరించింది.

ఏఎండీ తాజా ప్రతిపాదనలపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఆన్‌లైన్‌లో టీఎ్‌సడబ్ల్యూడీ సమావేశం జరిగింది. వన్యప్రాణుల మనుగడ దృష్ట్యా యురేనియం అన్వేషణ చేపట్టవద్దని చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతిని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు పంపించింది.

Courtesy Andhrajyothi