• ప్రేమపెళ్లి చేసుకొని నాలుగేళ్లు కాపురం
  • తక్కువ కులమంటూ భార్యకు వేధింపులు
  • చివరికి గొంతు నులిమి హత్య చేసిన భర్త

చౌటుప్పల్‌ రూరల్‌: ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకొని ఆదర్శం చాటిన ఆ వ్యక్తిలో కులోన్మాది నిద్రలేచాడు. తక్కువ కులమని భార్యను వేధిస్తూ చివరికి ఆమెను గొంతు నులిమి హత్యచేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం లింగోజిగూడెంలో ఈ దారుణం వెలుగుచూసింది. బిహార్‌ రాష్ట్రం హారార్‌ కగారియా జిల్లా మోర్కారాతానా తాలుకా మారాటూరి గ్రామానికి చెందిన సింతు కుమార్‌(26) అదే గ్రామానికి చెందిన సంగీత(23)ను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. సింతు కుమార్‌ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే తక్కువ కులానికి చెందిన దానివంటూ భార్య సంగీతను భర్త వేధించేశాడు. అతడి తల్లిదండ్రులు కూడా సంగీతను వదిలిపెట్టాలని ఒత్తిడి తెచ్చారు.

Courtesy Andhrajyothi