Image result for వైద్యురాలి హత్యపై కాలనీ వాసుల నిరసన"

  • దేశమంతా స్పందించినా ఆయన పరామర్శించలేదేం?
  • నాయకులు, పోలీసులకు నో ఎంట్రీ’!
  • వైద్యురాలి హత్యపై కాలనీ వాసుల నిరసన
  • ప్రధాన గేటుకు తాళం.. రావద్దంటూ బోర్డులు
  • వెనుదిరిగిన చాడ, జూలకంటి, కౌశల్‌
  • కేంద్ర మంత్రి సంజీవ్‌ బల్యాన్‌ పరామర్శ
  • సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల దిగ్ర్భాంతి
  • చీకటి కొట్లలో మానవ మృగాలు
  • నిందితుల్లో కానరాని పశ్చాత్తాపం
  • చర్లపల్లి జైల్లోని సింగిల్‌ సెల్స్‌లో
  • రాత్రి మొత్తం మెలకువగానే!
  • జైలు వద్ద యువత, మహిళల ఆందోళన

శంషాబాద్‌రూరల్‌: వెటర్నరీ డాక్టర్‌ హత్యపై దేశం మొత్తం స్పందించినా.. సీఎం కేసీఆర్‌ మాత్రం ఇప్పటి వరకూ మాట్లాడకపోవడం దారుణమని నక్షత్ర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కాలనీ ప్రధాన గేటుకు మహిళలు తాళంవేసి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు స్పందించినా.. సీఎం కేసీఆర్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ స్పందించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మంత్రులు వచ్చి పరామర్శలు చేస్తున్నారు తప్ప బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. గేటు వద్ద పోలీసులు, కాలనీ వాసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సీపీఎం నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాగా అడ్డుకున్నారు. ‘నో ఎంట్రీ ఫర్‌ పోలీస్‌ అండ్‌ పొలిటీషియన్‌’ అని బోర్డులు పెట్టారు. నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. షాద్‌నగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించిన వారిపై లాఠీచార్జి చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శిక్ష పడేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా.. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, నటుడు కౌశల్‌ తదితరులను కాలనీవాసులు అడ్డుకోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండానే వెనుదిరిగారు. చాడ మాత్రం విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు.

(Courtesy Andhrajyothi)