హోం మంత్రి మహమూద్‌ అలీ అభ్యంతరకర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: డాక్టర్‌ ప్రియాంక కుటుంబ సభ్యులను హోంమంత్రి మహమూద్‌ అలీ శుక్రవారం పరామర్శించారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రియాంక చదువుకుంది కదా! ఆమె 100కు ఎందుకు ఫోన్‌ చేయలేదు? తన చెల్లెలికి బదులుగా ఆమె పోలీసులకు ఫోన్‌ చేసి ఉండాల్సింది. అప్పుడు ఆమెను రక్షించే అవకాశం ఉండేది’’ అని వ్యాఖ్యానించారు. పోలీసులు సమర్థంగానే పని చేస్తున్నారన్నారు. అయితే, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని పోలీసుల తీరును పక్కనబెట్టి.. ప్రియాంక అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.