Image result for disha accused families questions"– కోర్టు ఉండగా పోలీసులెలా చంపుతారు..
– మమ్మల్నీ అలానే చంపేయండి
– దిశ నిందితుల కుటుంబాల ఆగ్రహం
– మృతుల గ్రామాల్లో భారీ పోలీసు బందోబస్తు
”మా బిడ్డలు చేసింది ముమ్మాటికీ.. వందశాతం తప్పే.. ఆ ఆడపిల్లలాగే మాకూ ఉన్నారు.. కోర్టు వారికి ఏ శిక్ష వేసినా సరి అన్నాం.. కానీ, కోర్డు ఆదేశాలతో రిమాండ్‌లో ఉన్న మా బిడ్డలను విచారణ పేరుతో తీసుకొచ్చారు. ఆధారాలంటూ బయటకు తీసుకెళ్లిన పోలీసులు కాల్చి చంపారు. ఎన్‌కౌంటర్‌ చేసే హక్కు వారికెవరిచ్చారు? వారు చేసిన తప్పుకు జైల్లో శిక్ష అనుభవించినా ఎప్పటికైనా బయటకు రావడమో.. లేదా జైల్లోనే ఉంటారనుకున్నాం. కానీ ఇలా తీసుకొచ్చి చంపేస్తే కోర్టులెందుకు? మా కుటుంబాలకు ఆధారమైనమా బిడ్డలను చంపేశారు.. ఇక మాకు దిక్కె వరు? మేమెలా బతకాలి? వాళ్లనెలా చంపారో మమ్మ ల్నీ అలానే చంపేయండి..” అంటూ దిశ నిందితుల కుటుంబీకుల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు మృతుల గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు.. జడ్చర్ల, బాలనగర్‌, భూత్పూర్‌ పోలీసులు మహ బూబ్‌నగర్‌ వచ్చారు. మరికల్‌, నారాయణపేట, ఉట్కూర్‌, సీసీకుంట పరిధిలోని పోలీసులు ఉదయం 10.30కి మక్తల్‌, గుడిగండ్ల, జక్లేర్‌కు వచ్చి బందో బస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు పర్య వేక్షణ చేశారు. ఎప్పటికప్పుడూ పై అధికారుల సూచ న మేరకు కదలికలు చేపడుతున్నారు.
మృతదేహా లను పూడ్చడానికి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో గుంతలు తవ్వించారు. అక్కడ సైతం పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. గుడిగం డ్లలో శివ, చెన్నకేశవులు, నవీన్‌ మృతదేహాలను, జక్లేర్‌లో మహమ్మద్‌ ఆరీఫ్‌ మృతదేహాన్ని పూడ్చ డానికి గుంతలు తవ్వించారు. ఆయా గ్రామాల్లో మృతుల ఇండ్లల్లో రోదనలు మిన్నంటాయి.
కుటుంబాన్ని మోసేదెవరు..: మౌలానాబీ (మహ్మద్‌ ఆరీఫ్‌ తల్లి)
నా కొడుకే మా కుటుంబ ఆధారం. ఇప్పుడు ఆ ఆధారం కోల్పోయాం. ప్రమాదంలో నా భర్త నడుము పోయింది. అతడు ఏ పనీ చేయలేడు. నాకు కండ్లు సరిగ్గా కనబడవు. చెవులు వినబడవు. నాకు 18 ఏండ్ల కూతురుంది. నా కొడుకే ఆమెకు పెండ్లి చేస్తాడని అనుకున్నాను. కొడుకు తెచ్చే పైసలతోనే ఇల్లు గడిచేది. ఇప్పుడు మాకెవరు దిక్కు.
ఎన్‌కౌంటర్‌ చేసే హక్కు ఎవరిచ్చారు: జోళ్ల మణెమ్మ (శివ తల్లి)
నా కుమారుడు తప్పు చేసిండని అందరూ చెబితే నమ్మినం. కోర్టు ఏ తీర్పు వేసి నా మాకు అభ్యంతరం లేదని చెప్పాం. ఈనెల 14 వరకు రిమాండ్‌లో జైల్లో ఉన్న నా కొడు కుని బయటకు తీసుకొచ్చారు. విచారణ పేరుతో రాత్రి బయటకు తీసుకెళ్లి ఎందుకు కాల్చి చంపారు. మాకు చివరి చూపు కూడా దక్కకుండా చేశారు.
మమ్మల్నీ చంపేయండి: జయమ్మ (చెన్నకేశువులు తల్లి, గుడిగండ్ల)
డాక్టరమ్మను నా కొడుకు చంపడం వంద శాతం తప్పే. కోర్టులో ఏ శిక్ష పడ్డా మాకు సంతోషమే. ఈ నెల 14 వరకు నా కొడుకుని రిమాండ్‌కు పంపారు. కానీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకుం డా పోలీసులు నా కొడుకును చంపేశారు. వాడిని చంపేసినట్టు మమ్మల్నీ చంపేయండి
నేనుండి ఏం లాభం: రేణుక (చెన్నకేశవులు భార్య)
నా భర్త మాకు దూరమయ్యాడు. నేను ఉండి ఎం లాభం. చిన్న తనంలో మా వాళ్లు నాకు చెన్నకేశవులుతో పెండ్లి చేశారు. నేను ఇప్పుడు గర్భవతిని. ఆయన లేకుండా ఎలా బతకాలి. చంపేముందు కనీసం ముఖం అయినా చూపలేదు. కోర్టు ఉండగా.. పోలీసులు ఎలా చంపుతారు?
పోలీసులు చంపడం ఏంది?: లక్ష్మి (నవీన్‌ తల్లి)
ఎవరైనా తప్పులు చేస్తే… కోర్టులు తీర్పు ఇస్తాయి. కానీ నా బిడ్డ విషయంలో అలా జరగలేదు. బిడ్డ తప్పు చేయలేదని నేను అనడం లేదు. వాడికి శిక్ష పడాల్సిందే. కానీ శిక్ష వేసేది ఇలా కాదు. విచారణ పేరుతో అర్ధరాత్రి తీసుకుపోయి ఎన్‌కౌంటర్‌ ఎలా చేస్తారు?

(Courtesy Nava Telangana)