ముస్లింల గోడు పట్టేదెవరికి?

[avatar user=”bhaskar@desidisa.com” size=”thumbnail” align=”right”]బి. భాస్కర్[/avatar]

 

 

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ముస్లింల గోడు ఎవ్వరికీ పట్టకపోవడం ఎంతైనా అందోళన కలిగించే అంశం. అధికార బీజేపీ మైనార్టీ విద్వేష విధానాలు అవలంభించగా, మరోపక్కకాంగ్రెస్ ‘సాఫ్ట్ హిందూత్వ’ బాట పట్టింది.

ముస్లింల సమస్యల గురించి ఆ పార్టీ అస్సలు గళమెత్తలేదు. మైనార్టీల రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడితే హిందువుల ఓట్లు రావేమోనన్న భయం హస్తం పార్టీని వెంటాడుతోంది. అందుకే, రాహుల్ గాంధీ జంధ్యదారి, శివభక్తుడని ప్రకటించుకుంది. స్వయంగా రాహులే గుళ్లూ గోపురాల చుట్టూ ఓట్ల యాత్ర జరిపారు. మొత్తం చూస్తే 1980ల తర్వాత బీజేపీ పెరుగుదలతో ముస్లింల అధోగతి ప్రారంభమైందనవచ్చు. చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం నేడు అత్యంత అధోగతిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో ముస్లింల జనాభా 14.25శాతం. ప్రపంచంలో ఇండోనేషియా పాకిస్తాన్ తర్వాత మన దేశంలోనే అత్యధికంగా ముస్లింలు నివసిస్తున్నారు. కానీ 2014 లోక్ సభ 543 మందికిగాను 20 మంది ముస్లింలు మాత్రమే ఎంపీలు ఎన్నికయ్యారు. తాజా 2019 ఎన్నికల్లో 26 మంది గెలిచారు. మొత్తం సభల్లో ఇది 4.7శాతం 1980లో ఈ సంఖ్య 49 అంటే సగానికి పైగా పడిపోయిందన్నమాట! (101 సీట్లలో 20 శాతం ముస్లిం జనాభా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం. అధికార బీజేపీకి నేడు ఒక్క ముస్లిం లోక్సభ సభ్యుడు కూడా లేరు. 2018 నాటి లెక్కల ప్రకారం బీజేపీకి దేశంలో రికార్డు స్థాయిలో 1418 మంది శాసనసభ్యులు ఉండగా, అందులో నలుగురు మాత్రమే ముస్లింలు. 2014 నవంబరు నాటికి బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఆ సముదాయానికి చెందిన ఎంఎల్ఏలు 300 మంది దేశంలో ముస్లిం విద్వేశ – విస్మరణ రాజకీయాలు బీజేపీ ఎదుగుదలతోనే అధికమైంది.

కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు ముస్లింలను దువ్వే రాజకీయాలు, కుహనా లౌకిక రాజకీయాలు చేస్తున్నాయనేది ప్రధానంగా బీజేపీ ఆరోపణ. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక ఈ మాటలుబట్టి బూటకమని తేల్చింది. ఆర్ధికంగా, సామాజికంగా ముస్లింలు దళితుల కంటే మాత్రమే ముందున్నారని, ఓబీసీలకు దరిదాపుల్లో ఉన్నారని గణాంకాలతో సహా రుజవు చేసింది. ‘మైనార్టీలను రాజకీయంగా అణచివేసి వారికి ప్రాతినిధ్యంలేకుండా చేస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతుందని ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జఫ్రలోట్ తన తాజా పుస్తకం ‘మెజారిటేరియన్ స్టేట్ – హౌ హిందూ నేషనలిజం ఈజ్ ఛేంజింగ్ ఇండియాలో వ్యాఖ్యాన్నించారు.

ఉన్నతాధికార వ్యవస్థల్లోనూ ముస్లింల ప్రాతినిధ్యం దిగదిడువుగానే ఉంది. ఐపీఎస్లలో 3 శాతం ఐఏఎస్లో 3.3 శాతంగా ఉండటం మొత్తంగా ప్రభుత్వ తీరుకు దర్పణం పడుతోంది. ఇటీవల సంవత్సరాలల్లో గో సంరక్షణ, లవ్ జీహాద్ల పేరిట జరిగిన అఖాక్, పెహల్లాఖాన్ తదితరుల ఊచకోత విద్వేచ రాజకీయాలకు పరాకాష్ట. మే 23 ఫలితాల | తార్వత ఈ దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వ సంస్థల్లో అధికార వ్యవస్థల్లో, ఆర్థిక రంగంలో నేడు ఎదుర్కొంటున్నంత వివక్షను ముస్లింలు ఏనాడూ ఎదుర్కోలేదని ప్రొఫెసర్ జఫ్రలోట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్లో ఏలాగైతే అరబ్బులను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారో అలాంటి దుస్థితి ముస్లింలకు ఇండియాల్లో ఏర్పడుతున్నదని ఆయన వాపోతున్నారు. లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు ఈ హెచ్చరికలు వినపడుతున్నాయా అన్నదే నేటి ప్రశ్న.

రచయిత సీనియర్ జర్నలిస్టు 
మొబైల్ : 9989692001