– కేరళ న్యాయ విద్యార్థిని వినూత్న నిరసన

తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ), జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ.. నిరసనలు మిన్నం టుతున్నాయి. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ యువతి ”మిస్టర్‌ మోడీ, నేనే ఇందులేఖ, దుస్తుల ఆధారంగా నన్ను గుర్తించగలరా?” అని ప్లకార్డు పట్టుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవు తున్నది.

వివరాల్లోకెళ్తే.. గతవారం కేరళలోని ఎర్నాకుళంలో సీఏఏను వ్యతిరేకిస్తూ.. విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనల్లో ఎర్నాకుళం ప్రభుత్వ న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇందులేఖ(18) వినూత్నంగా.. బుర్ఖా ధరించి, ”మిస్టర్‌ మోడీ, నేను ఇందులేఖ, నా దుస్తుల ఆధారంగా నన్ను గుర్తించగలరా?” అని ప్లకార్డును ప్రదర్శించింది. ఈ ఫోటోను తన స్నేహితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇందులేఖ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ అవమానించడానికి ప్రయత్నించలేదనీ, ఎన్నార్సీ, సీఏఏపై నా మనస్సులోని ఉన్న భావనను వ్యక్తపరిచానని తెలిపారు.

(Courtesy nava telangana)