Image result for స్మార్ట్‌ ఫోన్లలో మ్యాపులు"న్యూఢిల్లీ, డిసెంబరు 25: స్మార్ట్‌ ఫోన్లలో మ్యాపులు చూస్తున్నారా.. అయితే కొంచెం జాగ్రత్త. ఒకటికి రెండు సార్లు పరిశీలించండి. దిక్కుల విషయంలో తేడా రావచ్చు. ఎందుకంటే ఉత్తర అయస్కాంత ధ్రువం కదలిపోతోంది. ఇది స్మార్ట్‌ ఫోన్లపైనా ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా ఫోన్లలో మూడు రకాల అయస్కాంత సెన్సర్లు ఉంటాయి. ఇవి దిక్కులను చూపిస్తాయి. నావిగేషన్‌లో ఉపయోగపడతాయి. అయితే వీటిని 5 సంవత్సరాల కాలానికి సెట్‌ చేస్తారు. అయస్కాంత ధ్రువం మారుతూ ఉండటం, ఈ సెన్సర్లను అప్‌డేట్‌ చేయకపోవడంతో దిక్కులను తప్పుగా చూపించే అవకాశం ఉంది. ఇది దైనందిన జీవితంలో ప్రభావం చూపనప్పటికీ, రక్షణ, విమానయాన రంగాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. క్యాబులు, ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చన్నారు.

(Courtesy Andhrajyothi)