• వారంలోపే 12కోట్లమంది బలి
  • ప్రపంచం మొత్తమ్మీదా ప్రభావం
  • అమెరికా వర్సిటీ పరిశోధకుల విశ్లేషణవాషింగ్టన్‌, అక్టోబరు : దాయాది దేశాలు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణుయుద్ధమంటూ జరిగితే.. వారం రోజుల్లోపే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది దాకా ప్రాణాలు కోల్పోతారని అమెరికాలోని కొలరాడో బౌల్డర్‌ అండ్‌ రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఇటీవలికాలంలో ఉద్రిక్తతలు తలెత్తడం.. ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రసంగంలో రెండు అణ్వస్త్ర దేశాల పోరు గురించి మాట్లాడడం తదితర పరిణామాల నేపథ్యంలో వారు.. ‘ఒకవేళ యుద్ధమంటూ జరిగితే’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. వారి విశ్లేషణ ప్రకారం.. రెండు దేశాల వద్దా చెరో 150 దాకా అణు వార్‌హెడ్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్య 200-250కి చేరొచ్చు. అప్పుడు గనక యుద్ధం జరిగితే మరణాల రేటు రెట్టింపు అవుతుందని.. అణుధార్మిక ప్రభావానికి గురయి సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

Courtesy Andhrajyothi…