• అభ్యర్థుల జాబితా ఖరారయ్యాకే వీవీప్యాట్‌ యంత్రాలలో లోడింగ్‌
  • అప్పుడే మాల్‌వేర్‌నూ ప్రవేశపెట్టొచ్చు
  • మాజీ ఐఏఎస్‌ కన్నన్‌ గోపీనాథన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ఈవీఎంల హ్యాకింగ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది! ఈనేపథ్యంలో వీవీప్యాట్‌ యంత్రాల హ్యాకింగ్‌కు అవకాశం ఉందని మాజీ ఐఏఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌ సంచలన ఆరోపణ చేశారు. ‘‘వీవీప్యాట్‌ యంత్రాలు రాకముందు పోలింగ్‌ బూత్‌లో రెండు యంత్రాలుండేవి. ఒకటి.. బ్యాలెట్‌ యూనిట్‌(బి.యు.) అంటే ఈవీఎం. రెండోది.. కంట్రోల్‌ యూనిట్‌(సి.యు.). ఇది ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఉంటుంది. ఆయన కంట్రోల్‌ యూనిట్‌లో బటన్‌ నొక్కితేనే మనం బ్యాలెట్‌ యూనిట్‌లో ఓటు వేయగలుగుతాం. అలా మనం వేసిన ఓటు నేరుగా కంట్రోల్‌ యూనిట్‌లో నిక్షిప్తం అయ్యేది.

Courtesy Andhrajyothi…