దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సహ ఉద్యోగులు
నవాబుపేట, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు పశువైద్య ఉపకేంద్రం వైద్యురాలు దిశ అత్యాచారం, సజీవ దహనం కేసులో నిందితులకు తగిన శాస్తి జరిగిందని ఆమెతో కలిసి పనిచేసిన ఉద్యోగులు పేర్కొన్నారు. నవాబుపేట మండలంలో పశువైద్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మృగాళ్ల ఎన్‌కౌంటర్‌పై ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. దిశ ఆత్మకు శాంతి కలిగిందని పేర్కొన్నారు.
Image result for ఎన్‌కౌంటర్‌ పై దిశ సహోద్యోగుల మాట"
దిశ ఆత్మకు శాంతి : సంఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం వల్ల దిశ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నా. పోలీసులు తమ తప్పును సరిదిద్దుకున్నారు. ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. దిశలాంటి దుర్ఘటనలు జరగకుండా ఫిర్యాదులు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించాలి.
డాక్టర్‌ స్వప్న, పశు వైద్యాధికారిణి, నవాబుపేట
Image result for ఎన్‌కౌంటర్‌ పై దిశ సహోద్యోగుల మాట"
ఆకతాయిల గుండెల్లో భయం పుట్టాలి : దిశ కేసులో పోలీసులు జరిపిన చర్యతో ఆకతాయిల గుండెల్లో భయం పుట్టాలి. అమ్మాయిలను అమ్మగా, చెల్లిగా చూడాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షలు పడేలా చట్టాలు అమలు చేయాలి. ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి.
తారాబాయి, ఎల్‌ఎస్‌ఏ, పోమాల్‌ పశువైద్య ఉపకేంద్రం

Image result for ఎన్‌కౌంటర్‌ పై దిశ సహోద్యోగుల మాట"

పోలీసులకు హాట్సాఫ్‌ : మా మేడం చాలా అమాయకురాలు. విధులను అకింతభావంతో నిర్వహించేవారు. ఆమెను అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారి నిర్ణయాన్ని అభినందిస్తూ నవాబుపేటలో పోలీసులకు మిఠాయిలు పంచిపెట్టా. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు హాట్సాఫ్‌. సజ్జనార్‌ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
సర్వర్‌, అటెండర్‌, కొల్లూరు పశువైద్య ఉపకేంద్రం
చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి : మృగాళ్ల ఎన్‌కౌంటర్‌తో దిశ మేడమ్‌ ఆత్మకు శాంతి కలిగింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి. అమ్మాయిల వంక చూస్తే భయపడేలా చట్టాలు రావాలి. అందరి సమక్షంలో శిక్షిస్తే ఆకతాయిల ఆగడాలు ఆగుతాయి.
Image result for ఎన్‌కౌంటర్‌ పై దిశ సహోద్యోగుల మాట"
సంజీవయ్య, అటెండర్‌, పోమాల్‌ పశువైద్య ఉపకేంద్రం

(Courtesy Eenadu)