చెన్నై : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన ఏనుగు దంతాల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యారాణి బీజేపీలో చేరారు. శనివారం జిల్లా కేంద్రం కృష్ణగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంకే తదితర పార్టీలకు చెందిన వెయ్యిమంది అనుచరులతో కలిసి ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా విద్యారాణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రేరణతోనే తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు.

Courtesy Andhrajyothi