Image result for పది మంది బిడ్డలు జన్మించారు"వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు సాధారణ ప్రసవాల్లో పది మంది బిడ్డలు జన్మించారు.  ఈ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు పదిమంది శిశువులు జన్మించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నర్సింహస్వామి బుధవారం తెలిపారు. సామాజిక ఆసుపత్రులకు సంబంధించి ఇదే అధికమన్నారు. గతంలోనూ ఇక్కడ ఒకే రోజున సాధారణ ప్రసవాల్లో ఏడుగురు శిశువులు జన్మించారని పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, వర్ధన్నపేట టౌన్‌

(Courtesy Eenadu)