•  23 మంది పిల్లలు క్షేమం
  • పోలీసుల కాల్పుల్లో నిందితుడు సుభాష్‌ హతం
  • పోలీసులను అభినందించిన అమిత్‌ షా

ఫరూకాబాద్‌ : యూపీలో 23 మంది చిన్న పిల్లలను బంధించిన సుభాష్‌ బాథమ్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. పోలీసులు దాదాపు 8 గంటలు శ్రమించి పిల్లలను క్షేమంగా విడిపించారు. మరోవైపు అతని భార్యను స్థానికులు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతకుముందు పిల్లలను వదిలేయాలని పోలీసులు సుభా్‌షతో చర్చించడానికి ప్రయత్నించారు. కానీ అతడు పోలీసులపైకి పలుమార్లు కాల్పులు జరిపాడు. నాటుబాంబులతో బెదిరించాడు. దీంతో ఎదురు కాల్పులు జరపవలసి వచ్చింది.

ఈ ఘటనలో సుభాష్‌ అక్కడికక్కడే చనిపోయాడు. సుభాష్‌ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులు పిల్లలను విడిపించారు. అప్పటికే నిందితుడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్థానికులు అతని భార్యను రాళ్లతో కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. కాగా, పిల్లలు బయటపడటంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా యూపీ పోలీసులను, సీఎం యోగిని అభినందించారు.

Courtesy Andhrajyothi