దక్షిణాదిన 20%, ఉత్తరాదిన 40%వివక్ష: సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 23: భారత్‌లో అంటరానితనం కొనసాగుతూనే ఉంది. మధ్య భారతంలో 49% ఉత్తరాదిన 40, దక్షిణాదిన 20 పశ్చిమ రాష్ట్రాల్లో 13%చొప్పున కుటుంబాలు ఈ వివక్షను పాటిస్తున్నాయని ఎన్‌సీఏఈఆర్‌, మేరీల్యాండ్‌ వర్సిటీ సర్వేలో తేలింది. 42 వేల కుటుంబాలపై చేసిన సర్వే ఆధారంగా రచయితలు ప్రొ.అమిత్‌ తోమర్‌, ప్రొ.ఓంకార్‌ జోషి ఈ విషయం వెల్లడించారు. జైనుల్లో 35ు, హిందువుల్లో 30%, బౌద్ధుల్లో 1% కుటుంబాలు ఈ అమానుషాన్ని అనుసరిస్తున్నాయి. విద్యావంతుల కుటుంబాల్లో అంటరానితనం తక్కువగా ఉంది.