ఉన్నావో అత్యాచార బాధితురాలికి నిప్పంటించిన వైనం..

ఉన్నావో (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం గురువారం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువతిపై కొన్నాళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన నిందితులు జైలు నుంచి బెయిలుపై విడుదలై వచ్చాక, బాధిత యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించిన దారుణ ఘటన యూపీలో సంచలనం రేపింది. ఉన్నావో గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిపై కొన్నాళ్ల క్రితం కొందరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిందితులు జైలు నుంచి బెయిలుపై విడుదలై గ్రామానికి తిరిగివచ్చారు. అనంతరం బాధిత యువతిని ఉన్నావో గ్రామ శివార్లలోని పొలాల్లోకి లాక్కెళ్లి, ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన బాధిత యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. బాధిత యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దారుణ ఘటనతో ఉన్నావో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Courtesy Andhrajyothi…