పీటర్‌ హండ్కె ఎంతో వివాదాస్పదమైన రచయిత. సెర్బియాలో నరమేధం జరుగుతున్న సమయంలో నాయకుడుగా వున్న మిలోసెవిక్‌ పాత్రని సమర్థించాడు. హండ్కె పేరుని ప్రకటించినప్పుడు స్టాక్‌హోమ్‌లోని ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. కాని స్వీడిష్‌ అకాడమీ ‘‘భాషా చాతుర్యంతో అతడు తన రచనలలో మానవ అనుభవాల వైశాల్యాన్నీ, నిర్దిష్టతనీ చూపాడు’’ అని వ్యాఖ్యానించింది.

రస్కారాన్ని ఇచ్చిన కారణాలు ఇవి: ‘‘ఆమె తన రచనా పాటవంతో ఊహాబలంతో, విజ్ఞాన సర్వస్వ సమానమైన భావావేశంతో- సరిహద్దులు చెరిపి వేయటాన్ని ఓ జీవన విధానంగా చూపిస్తుంది.’’

కొన్ని అసాధారణ కారణాల వలన స్వీడిష్‌ అకాడమీ గత సంవత్సరం సాహిత్య నోబెల్‌ బహుమతిని ప్రకటించడం ఆపివేసి ఈ సంవత్సరంలో రెండు బహుమానాలనూ కలిపి ప్రకటించాలనుకున్న నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ రెండు బహుమతుల ప్రకటనలు ఇవి:

2018 – ఓల్గా టోకార్‌జుక్‌ (పోలండ్‌)
2019 – పీటర్‌ హండ్‌కె (ఆస్ర్టియా)
ఓల్గా టోకార్‌జుక్‌ (2018)
ఈమె పోలండ్‌ దేశానికి చెందిన నవతరం రచయితలలో ఎంతో పేరుప్రఖ్యాతులు పొందినది. తన నవల Flights (2017)కి బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నది

ఈ ఏభై ఏడేళ్ళ రచయిత్రి పోలండ్‌ దేశంలో జైలోనా గోరాకి దగ్గరలో వున్న ఊరు Sulechowలో జన్మించింది. యూనివర్సిటీలో చదివి సైకాలజి్‌స్టగా కొన్నాళ్ళు మానసిక సమస్యలున్న యువకుల ఆసుపత్రిలో పనిచేసింది. తననితాను Carl Jung శిష్యురాలిగా భావిస్తుంది. తాను చదివిన సైకాలజీ విద్య తన రచనలకి సహకరిస్తుందని, ఓ విధంగా ప్రేరణగా వుంటుందనీ భావిస్తుంది. ఈమె వామపక్ష భావాలున్న రచయిత్రి. కొంతకాలంగా ఓ చిన్నవూళ్ళో నివసిస్తూ అక్కడ ఓ చిన్న ప్రచురణ సంస్థని నెలకొల్పింది. దాని పేరు Ruta.

ఓల్గా మొదటి పుస్తకం ఓ కవితల సంపుటి- Cities in Mirrors (అద్దాలలో నగరాలు-1989). ఆమె మొదటి నవల- The Journey of the Book-People (1993). ఈ నవల ఇద్దరు ప్రేమికులు ఓ పుస్తకం కోసం చేసిన అన్వేషణ- జీవిత రహస్యానికి వున్న అర్థం ఆ పుస్తకం- ఇది జరిగేది పదిహేడవ శతాబ్దంలో ఫ్రాన్స్‌ దేశంలో. ఆమె రాసిన ఇతర పుస్తకాలు: The Ward Robe (1997), House of Day, House of Night (1998), Playing on Many Drums (2001) (కథా సంపుటి).

ఆమె ఓ విధమైన వ్యాసమూ, నవలా కలిపిన ప్రక్రియలో రాసిన రచన Flights. దీనిలోని ముఖ్యమైన థీమ్‌, ఆధునిక సంచార జీవులు. విమర్శకుల దృష్టిలో ఆమె రాసిన అతి ముఖ్య రచన The Books of Jacob. ఈ రచనని స్వీడిష్‌ అకాడమీ ప్రత్యేకంగా పేర్కొన్నది. ఇది ఓ వేయి పేజీల నవల. ఇటీవలే ఆంగ్లంలోకి దీనిని అనువాదం చేస్తున్నారు.

ఆమెకు నోబెల్‌ పురస్కారాన్ని ఇచ్చిన కారణాలు ఇవి: ‘‘ఆమె తన రచనా పాటవంతో ఊహాబలంతో, విజ్ఞాన సర్వస్వ సమానమైన భావావేశంతో- సరిహద్దులు చెరిపి వేయటాన్ని ఓ జీవన విధానంగా చూపిస్తుంది.’’

అకాడమీ ఇంకా ఇలా అన్నది: ‘‘ఆమె రచయితగా తన చుట్టూ వున్న జీవితాలలో మమేకమై వుంటుంది. అదే సమయంలో ఆమె మ్యాపులతోనూ, ఊహాగానాల సహాయంతోనూ భూమి మీద వున్న జీవితాలను పైనుండి పరిశీలించి ప్రభావితమవుతుంది. ఆమె రచనలలో హాస్యమూ, కొంత జాణతనమూ నిండివుంటాయి.’’

ఓల్గా తల్లి ఓ టీచర్‌. తండ్రి లైబ్రేరియన్‌. పోలండ్‌లో ఉంటూ రచనలు చేయడం గురించి ఓల్గా ఇలా అన్నది: “”It’s a great place to be a writer. Nothing is obvious in Poland- You have to understand this.”

ఆమె వెజిటేరియన్‌, ఫెమినిస్ట్‌. అనువాదకుడు, తన సహచరుడు గ్రెగరీ జెగాడ్లో తో పోలండ్‌లో నివసిస్తున్నది. ఆమె నవల Flights గురించి ఓ విమర్శకుడు ఇలా రాశాడు.

“It moves briskly, buoyed by a sense of humor that is sometimes dark but often joyful. …. It’s one of the novel’s great strengths that Tokarczuk can keep you turning the pages even as you’re not entirely sure what she’s getting at, or how it all fits together..”

Flights నవలని ఈ పోలిష్‌ రచయిత్రి పోలి్‌షలో 2007లో రాసింది. దానిని ఆంగ్లంలోనికి 2017లో అనువదిస్తే దానికి ఆ సంవత్సరపు Booker Prize వచ్చింది.

ఈ నవల 17-21 శతాబ్దాలలో జరుగుతుంది. దీనిని 116 చిన్న చిన్న శకలాలుగా మార్చి రాసింది. కొన్ని శకలాలు కేవలం ఓ వాక్యం పొడవు మాత్రమే ఉంటాయి. మరికొన్ని దాదాపు 31 పేజీల వరకూ ఉంటాయి. ఈ విషయాలన్నీ ఏకరువు పెట్టేది ఓ ‘‘అనామక ప్రయాణీకురాలు.’’

ఈ నవలలో ఎన్నో అధ్యాయాలు ఉంటాయి. వాటిలో ఇరవై ఒకటో శతాబ్దంలో జరిగే ప్రయాణాన్ని గురించి, మానవ శరీర భాగాల గురించిన సమాచారం ఉంటుంది. ఇది ఈమె రాసిన నవలల్లో ఎంతో క్లిష్టమైనది. ఈ అధ్యాయాలలో ఎన్నో ప్రయాణాల సమాచారం ఉంటుంది. ప్రయాణాల సమాచారంతో పాటు మానవ శరీరభాగాల పరిశీలన ఉంటుంది. దీనిలో జీవితమూ, మరణమూ, కదలికలూ, వలస పోకడలూ వంటి అంశాలు ఉంటాయి.

పదిహేడవ శతాబ్దంలో ఓ డచ్‌ అనాటమీ శాస్త్రజ్ఞుడు ఫిలిప్‌ వెర్‌హెయిన్‌ (Verheyen) తన స్వంత కాలునే కోసుకుని డిసెక్ట్‌ చేసి వాటిని చిత్రాలుగా మార్చుకోవటం, పద్దెనిమిదో శతాబ్దంలో ఉత్తర ఆఫ్రికాలో పుట్టిన ఓ బానిస- ఆస్ట్రియాలో రాజాశ్రయాన్ని పొందిన అతడి శరీరాన్ని మరణం తర్వాత Stuff చేసి ప్రదర్శనలో ఉంచడం, ప్రముఖ సంగీత స్రష్ట ఫ్రెడరిక్‌ ఛోపిన్‌ హృదయాన్ని పందొమ్మిదో శతాబ్దంలో, రహస్యంగా పారిస్‌ నుండి అతడి మాతృదేశంలోని వార్సా నగరానికి చేరవేయడం, ప్రస్తుత కాలంలో వృద్ధుడైన భర్తతో ప్రయాణం చేస్తున్న యువభార్య ఇక్కట్లు, మరో యువకుడి భార్యా శిశువూ ఓ హాలీడే సమయంలో కనిపించకుండా పోవటం… ఇవన్నీ వేరు వేరు సమయాలలో జరిగే Unconnected incidents&  చివరకు ఓల్గా టోకార్‌జుక్‌ ఈ సంఘటనలలో దాగివున్న మూలాల మానవ సూత్రాన్ని మనకి అర్థమయ్యేలా చెపుతుంది.

కాలగమనంలో కనిపించని మానవ సంబంధిత రహస్య లింక్‌లూ, ఆధునికతలోని పైపొరలోని అర్థాలు మనకు ఈ నవలలో తెలుస్తాయి. వీటన్నిటి ఆధారంగా మానవత్వపు లోతైన బంధాలు మనకి అర్థమవుతాయి.

ఓల్గా ఇటీవల రాసిన రచన The Books of Jacob – ఇది ఓ వేయి పేజీల నవల. ప్రస్తుతం ఆంగ్లంలోకి అనువాదం చేస్తున్నారు. ఈ నవలలో ఆమె 18వ శతా బ్దపు మతగురువు జాకబ్‌ ఫ్రాంక్‌ కథ చెబుతుంది. ఇతడు బలవంతంగా జ్యూయిష్‌ అనుయూయిలను ఇస్లాంలోకి, కాథలిక్‌ మతానికి వేరు వేరు సమయాలలో బలవంతంగా మతమార్పిడి చేయించాడు. ఈ నవలని మొదటిసారి పబ్లిష్‌ చేసినప్పుడు ప్రచురణ కర్తలు ఆమె రక్షణకు బాడీగార్డులను ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది. అది దాదాపు 170,000 కాపీలు హార్డ్‌బాక్‌ ఎడిషన్‌లో అమ్ముడుపోయి పోలండ్‌లో ప్రముఖ సాహిత్య సంఘటనగా పేరుపొందింది. దీనికి Nike అవార్డ్‌ కూడా ఇచ్చారు. ఈ అవార్డ్‌ ఆమెకి రావడం రెండోసారి.

పీర్‌ హండ్కె (2019)
కొన్ని సంవత్సరాల నాడు నోబెల్‌ అకాడమీ సెక్రటరీగా పనిచేసిన వివాదాస్పద హొరేస్‌ ఎంగ్‌డాల్‌ ఇలా ప్రకటించాడు: ‘‘ఒక యూర్‌పలోనే సరైన సాహిత్యం పుడుతున్నది. మిగిలిన దేశాల సాహిత్యానికి ఏమంత విలువలేదు.’’ ప్రత్యేకంగా అమెరికాను ఇంకా దారుణంగా విమర్శించాడు.

అందువలన Eurocentric భావనలు నోబెల్‌ అకాడమీ సభ్యులలో లోతుగా పాతుకుపోయి వున్నాయన్న అనుమానం ప్రపంచ ప్రజలకు వచ్చింది. దానికి బలం చేకూర్చే విధంగా ఈనాటి నోబెల్‌ బహుమతులు అకాడమీ సభ్యుల మనోభావాలకి అద్దం పడుతున్నాయి.

ఇద్దరు రచయితలూ యూర్‌పకి చెందినవారు కావడం యాదృచ్ఛికం కావచ్చు.

ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ నమ్మి చెప్పిన Ideal Direction & A lofty and sound idealism- వంటి కారణాల వలన లియో టాల్‌స్టాయ్‌కీ, హెన్రిక్‌ ఇబ్సెన్‌కీ, మార్క్‌ ట్వెయిన్‌కీ, ఎమిలీ జోలాకీ ఈ పురస్కారాలు లభించలేదు. స్వీడన్‌, రష్యా దేశాల మధ్యన వున్న చారిత్రక Antipathy వలన టాల్‌స్టాయ్‌, ఛెఖోవ్‌లకు ఈ పురస్కారాలు ఇవ్వలేదు.

ఇండియన్‌ రచయితలలో R.K. నారాయణ్‌ ఎన్నిసార్లు నామినేట్‌ అయినా, షార్ట్‌లి్‌స్టలోకి వచ్చినా అతడికి ఈ పురస్కారం లభించలేదు. నారాయణ్‌ తరపున రచయిత గ్రాహం గ్రీన్‌ ఎంతగానో ప్రయత్నం చేశాడు. మరో జోక్‌ ఏమిటంటే కొందరు నోబెల్‌ కమిటీ మెంబర్స్‌ నారాయణ్‌ పుస్తకాలు- The Guide, The English Teacher, The Painter of Signs, The Vendor of Sweets- వంటి వాటిని Self-help పుస్తకాలుగా అంచనావేసి నిర్లక్ష్యం చేశారని.

ఈనాటి అవార్డులు పూర్తిగా Eurocentricగా ప్రపంచ రచయితలు భావిస్తున్నారు. మరో వివాదాస్పద రచయిత పీటర్‌ హండ్కెకి 2019 నోబెల్‌ పురస్కారం లభించింది.

హండ్కె ఎంతో వివాదాస్పదమైన రచయిత. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ రచయిత సెర్బియాలో నరమేధం జరుగుతున్న సమయంలో నాయకుడుగా వున్న మిలోసెవిక్‌ పాత్రని సమర్థించాడు. ముస్లిమ్స్‌ ముస్లిమ్స్‌ని చంపుకుంటున్నారని ప్రతిపాదించాడు. ఆ నియంత మరణ సమయంలో ఓ ఉపన్యాసం కూడా ఇచ్చాడు. అప్పుడు రచయిత- సల్మాన్‌ రష్డీ అతడికి ు“Runner up for International Moron of The Year” అన్న బిరుదుని ఇచ్చాడు. ప్రస్తుతం రష్డీ తన మాటలలో ఏ మార్పు ఉండదని ప్రకటించాడు: ు“I have nothing to add today, But I stand by what I wrote then” అన్నాడు. ఇంతకీ రష్దీ ఉద్దేశంలో No.1 Moron ఎవరో తెలుసా? హాలీవుడ్‌ నటుడు చార్లెటన్‌ హెస్టన్‌. ఇతడు అమెరికన్‌ గన్‌ లాబీయిస్ట్‌.

ఈ ఆస్ట్రియన్‌ రచయిత పేరుని ప్రకటించినప్పుడు స్టాక్‌హోమ్‌లోని ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు.

కాని స్వీడిష్‌ అకాడమీ ‘‘భాషా చాతుర్యంతో అతడు తన రచనలలో మానవ అనుభవాల వైశాల్యాన్నీ, నిర్దిష్టతనీ చూపాడు’’ అని వ్యాఖ్యానించింది.

2004లో రచయిత్రి ఎల్‌ఫ్రీడి జెలినెక్‌ నోబెల్‌ బహుమతిని అందుకుంటూ ఇలా అన్నది: ‘‘నాకు పూర్తిగా నమ్మకముంది. ఆస్ట్రియన్‌కు ఈ అవార్డ్‌ వస్తే అది పీటర్‌ హండ్కేకే ఇవ్వాలి. అది న్యాయమైన నిర్ణయం.’’

హండ్కె మొదటి రచన The Hornets (1996) అనే నవల. తర్వాత ౖ Offending the Audience (1966) అనే నాటకం, The Peddler (1967) నవల, A Sorrow Beyond Dream – A Life అనే ఆత్మకథ రాశాడు. ఈ ఆత్మకథలో హండ్కె తన తల్లి ఆత్మహత్యను గురించి రాశాడు. దానికి కారణం అతని సవతి తండ్రి ఆల్కహాలిక్‌ కావడమే.

అతడి నవలలో ఎక్కువమంది చదివినది, విజయవంతమైనది The Fruit Seller (2017).

సినీ దర్శకుడు విమ్‌ వెండర్స్‌తో తీసిన Wings of Desire సినిమాకి స్ర్కీన్‌ ప్లే రాశాడు. ఇంకా ఎన్నో సినిమాలకి రచన చేశాడు.

Wings of Desire ప్రపంచంలోని ముఖ్యమైన సినిమాలు వెయ్యింటిలో 215వ స్థానంలో వున్నది. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇది ఓ కవిత్వం నిండిన సినిమా. రిల్కె కవిత్వ ఆధారంతో రాసి తీసిన సినిమా. ఈ సినిమా ఆరంభంలో వచ్చే కవితని హండ్కె రాశాడు:

Song of Childhood అనే ఈ కవితతోనే సినిమా ప్రారంభమవుతుంది.
When the child was a child
it walked with its arms swinging,
wanted the brook to be a river,
the river to be a torrent,
and this puddle to be the sea.
When the child was a child,
it didn’t know that it was a child,
to it, everything had a soul,
and all souls were one.

అతడి నవలల్లో ముఖ్యమైనది Moravian Night (2008). ఈ నవలలో నిజ ప్రపంచాలూ, జ్ఞాపకాలూ, ఘర్షణలూ వుంటాయి. దీనిని ఓ విమర్శకుడు-“Peter Handke’s Time-Traveling Tale of a Europe in Flux”గా వర్ణించాడు.

ఈ నవలలో మొరానియా నది మీద ఆగివున్న ఓ బోట్‌లో కొందరు వుంటారు. వారిలో ఓ రచయిత తను యూర్‌పలో చేసిన ప్రయాణాల అనుభవాలను గురించి చెబుతాడు. ఆ ప్రయాణం కొసోవోలో ప్రారంభమవుతుంది. Unreliable Narrtor తన మిత్రులతో తను నదులను అనుసరిస్తూ వంకరటింకరగా పోతూ చేసిన ప్రయాణాల గురించి; స్పెయిన్‌, పోర్చుగల్‌, ఆస్ట్రియాలలో చేసిన ప్రయాణాల అనుభవాల గురించి చెబుతాడు. చివరికి అతడు బాల్కన్స్‌కి చేరుకుంటాడు. అతడు చెప్పే విధానం చూస్తే ఆ ప్రదేశం పూర్తిగా లేకుండా మాయమైపోయి వుంటుంది. తన ప్రయాణాలలో అతడు రకరకాల పాత్రలను కలుస్తాడు. కొన్ని ప్రదేశాల పేర్లను మాత్రమే అతడు మనకి చెబుతాడు. నిజానికి ఈNarrator ఎక్కడ ఉన్నాడో పాఠకుడికి అర్థం కాదు- నేల మీద వున్నాడా? మన మనసులో ఉంటూRecollecting, philosophizing, Dreaming& చేస్తున్నాడా అర్థం కాదు. ఈ Narrativeని ఇంకా కలగాపులగం చేస్తూ అతడి మిత్రులు ఒక్కోసారి మధ్యలో కథలకి తమ వెర్షన్‌లను చెప్పడం ప్రారంభిస్తారు- ఇదంతా ఓ సుదీర్ఘ చీకటి రాత్రిలో జరుగుతుంది. ఆ నవలకు కేంద్రంగా మరో విచిత్ర స్త్రీ పాత్ర వుంటుంది- ఆమె ఎవరికీ కనపడకుండా, దాగివుంటూ, సేవలు చేస్తూంటుంది. ఒక్కోసారి ఆమే కథని నడుపుతుందా అని పిస్తుంది. కథలో జ్ఞాపకం, వాస్తవం యుద్ధంచేస్తూ వుంటాయి. ఈ నవలని క్రిష్ణా విన్‌స్టన్‌ అనువాదం చేశాడు. హండ్కెకు ఇంటర్నేషనల్‌ ఇబ్సెన్‌ అవార్డ్‌ 2014లో ఇస్తే జ్యూరీ సభ్యులు రిజైన్‌ చేశారు. వారు వాదన ఇది: “awarding Handke the Ibsen Prize is comparable to awarding the Immanuel Kant Prize to Goebbels.”

మరోసారి హండ్కెని హైన్రిచ్‌ హైని ప్రైజ్‌కి నామినేట్‌ చేశారు. ఆ ప్రైజ్‌ విలువ 50,000 యూరోలు. దానిని ఆమోదించవలసినది డసెల్‌ డార్ఫ్‌ నగర కౌన్సిల్‌ మెంబర్స్‌. వారిలో ఎక్కువమంది అతడికి వ్యతిరేకంగా ఓటు వేయడం వలన ఆ బహుమతిని వెనక్కి తీసుకున్నారు.

స్వీడిష్‌ అకాడమీ రానున్న రోజులలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుని, అంతర్జాతీయంగా ప్రముఖులైన రచయితలను దూరంగా పెట్టి, యూర్‌పలోని రచయితలకే బహుమానాలని ప్రకటిస్తూపోతే నోబెల్‌ సాహిత్య పుర స్కారానికి ఉన్న విలువ తగ్గుతుంది, ఓ హాస్యాస్పదమైన అవార్డ్‌గా- యూరోపియన్‌లు మాత్రమే పంచుకుని ఆనందించే వ్యవహారంగా దానిపై ముద్ర పడవచ్చు.

కె. సదాశివరావు