రెండ్రోజులు గడిచాయి… అమెరికా 46వ అధ్యక్షుడెవరన్నది తేలలేదు. ఫలితాల లెక్కింపు ఐపీఎల్‌ మ్యాచ్‌లోని సూపర్‌ ఓవర్‌లా మారింది. జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌లిద్దరూ సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ ముందుకెళుతున్నారు. అయితే విజయం బైడెన్‌నే వరించవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. మేజిక్‌ ఫిగర్‌ 270కి చేరువలో… ఆరు ఓట్ల తక్కువ దూరంలో ఆయన ఉన్నారు. అటు ట్రంప్‌ నాలుగు కీలక స్వింగ్‌ రాష్ట్రాల్లోని మూడింట స్వల్ప ఆధిక్యంతో ఉన్నా- ఫలితం పెద్దగా ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది.

ఇది గ్రహించే ఆయన ఆయా రాష్ట్రాల్లో కోర్టుకెక్కారు. కౌంటింగ్‌ తక్షణం ఆపేయాలని ట్వీట్లు చేస్తున్నారు. దేశమంతటా రిపబ్లికన్ల నిరసన హోరు.. వైట్‌హౌస్‌ను ఇక తనకనుగుణమైన రీతిలో ఎలా మల్చుకోవాలన్న ఆలోచనలతో వెబ్‌సైట్‌ ఆరంభించిన బైడెన్‌.. ఇదీ పోలింగ్‌ ముగిసిన రెండ్రోజుల తరువాత అగ్రరాజ్య పరిస్థితి!

 • విజయానికి 6 ఓట్ల దూరంలో బైడెన్‌
 • స్వింగ్‌ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్‌
 • 2 చోట్ల బైడెన్‌, 3 రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యం
 • ఒక్కటి గెలిచినా బైడెన్‌దే శ్వేతసౌధం
 • నాలుగు రాష్ట్రాల్లో కోర్టుకెక్కిన ట్రంప్‌
 • కౌంటింగ్‌ ఆపాలంటూ ట్వీట్లు
 • దేశవ్యాప్తంగా రిపబ్లికన్ల నిరసన
 • ఆయుధాలతో ప్రదర్శన.. పలువురి అరెస్ట్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ ఉత్కంఠను, అనిశ్చితిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. విజయం డెమోక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌దేనని దాదాపుగా తేలిపోయినా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేని స్థితి నెలకొంది.  కారణం… ఇంకా  అత్యంత కీలకమైన ప్రభావ (స్వింగ్‌) రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండడమే! తాజా గణాంకాల ప్రకారం బైడెన్‌… మేజిక్‌ ఫిగర్‌ 270 ఎలక్టోరల్‌ ఓట్లకు అతి చేరువలో అంటే 264 ఓట్లను గెలుచుకుని శ్వేతసౌధం వాకిట జయభేరి మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అటు రిపబ్లికన్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం 253-213 సంఖ్యను ఇస్తున్నాయి. కౌంటింగ్‌ సాగుతున్న వాటిలో ఒక చోట అంటే నెవడాలో బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు.

ఇదొక్కటి గెలి స్తే చాలు.. ఆయన అధ్యక్షుడు అయిపోతారు! అటు ట్రంప్‌ మూడు రాష్ట్రాల్లో.. పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, జార్జియాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఆయన విజయం సాధించాలంటే అన్నిటా గెలిచితీరాలి. అయితే గెలుపెవరిదన్నది ప్రకటించలేకపోవడానికి కారణం ఇద్దరి మధ్యా తేడా అతి స్పల్పంగా.. అంటే 1-2శాతం కంటే తక్కువగా ఉంది. లెక్కించాల్సినవి ఎక్కువగా పోస్ట ల్‌ బ్యాలెట్లేనని, ఇవి అధికంగా బైడెన్‌కే పడొచ్చని అంచనాలున్నా లెక్కింపు పూర్తయితే తప్ప ఎవరికెంత అన్నది చెప్పలేని పరిస్థితి! వివరంగా చెప్పాలంటే అరిజోనా, నెవడాల్లో ప్రస్తుతం బైడెన్‌కు ఆధి క్యం ఉంది. ఈ రెండింటా తన లీడ్‌ను చివరిదాకా నిలబెట్టుకుని గెలిస్తే ఆయనదే సింహాసనం. ట్రంప్‌కూ విజయావకాశాలున్నాయి. ఎలాగంటే పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, జార్జియా, అలాస్కాల్లో ఆయన ముందంజ లో ఉన్నారు. ఈ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ బైడెన్‌ లీడ్‌లో ఉన్న రెండు రాష్ట్రాల్లో కనీసం ఒకదాన్నైనా దక్కించుకోవాలి. ఇది చేయలేకపోతే ఆయన 268 ఓట్లు మాత్రమే సాధించి మేజిక్‌ ఫిగర్‌ సమీపం వరకూ వచ్చి ఓడిపోయినట్లవుతుంది.

రాత్రి 12 గంటలకు ఇదీ పరిస్థితి..

 1. 16 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లున్న జార్జియాలో ట్రంప్‌ ఆధి క్యం 18 వేల నుంచి 13 వేలకు తగ్గింది. లెక్కించాల్సిన ఓట్లు 50,000.ట్రంప్‌ గెలవాలంటే మరో 35-37ు ఓట్లు సాధించాలి.
 2. 20 ఎలక్టోరల్‌ ఓట్లున్న పెన్సిల్వేనియాలో గణించాల్సిన ఓట్లు 5.50 లక్షలు. ట్రంప్‌ ఆధిక్యం 6 లక్షల నుంచి 1.14 లక్ష లకు తగ్గింది. రాష్ట్ర జనాభాలో 12ుఉన్న ఫిలడెల్ఫియా నుంచి తుది వివరాలు రావాల్సి ఉంది. అలెఘ్నీ కౌంటీలో లెక్కింపు నిలిపేశారు. పోలింగ్‌ ముగిశాక 10 వేల ఓట్లు వచ్చి చేరాయి.
 3. 15 ఎలక్టోరల్‌ ఓట్లున్న నార్త్‌ కరోలినాలో లెక్కించాల్సిన  పోస్టల్‌ బ్యాలెట్లు 1.06 లక్షలు.
 4. 6 ఎలక్టోరల్‌ ఓట్లున్న నెవాడాలో 89ు ఓట్ల లెక్కింపు పూర్తయింది. కానీ లాస్‌ వెగా్‌సలాంటి చోట్ల పోస్టల్‌ ఓట్లు గణించాలి. గురువారం మధ్యాహ్నానికి గానీ(భారత కాలమా నం ప్రకారం శుక్రవారం) వివరాలు ప్రకటించబోమని అధికారులు చెప్పారు. ఇక్కడ ప్రస్తుతానికి బైడెన్‌దే ఆధిక్యం.
 5. మిషిగన్‌, విస్కాన్‌సన్‌ల్లో విజయం బైడెన్‌నే వరించింది. 2016లో ఈ రెంటినీ ట్రంప్‌ గెలుచుకున్నారు. ఈ రెండుచోట్లా  అన్యాయం జరిగిందంటూ ట్రంప్‌ కేసులు దాఖలు చేశారు.

ప్రతి ఓటూ లెక్కించాల్సిందే: బైడెన్‌
విజయం తమదేనని జో బైడెన్‌ ధీమా వ్యక్తం చేశారు. అయినా అన్ని ప్రభావ రాష్ట్రాల్లో ఆఖరి ఓటు దాకా ప్రతీ బ్యా లెట్‌నూ లెక్కించాల్సిందే అన్నారు. ‘నాపై విశ్వాసం ఉంచండి. మనం గెలుస్తున్నాం. కానీ కాస్త ఓపిక పట్టాలి’ అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు తన మద్దతుదారులతో మాట్లాడిన ఆయన ‘‘ఎన్నికల్లో ఎవరు విజేతో ప్రకటించడానికి నేను ఇక్కడకు రాలేదు. కానీ ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత మేమే గెలిచామని మాత్రం నమ్ముతున్నాం’’ అన్నారు. బైడెన్‌ ట్వీట్‌ చేసిన ఓ గంట తరువాత ట్రంప్‌ కూడా ‘‘స్టాప్‌ ది కౌంట్‌’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇది చూశాక రిపబ్లికన్‌ కార్యకర్తలు అనేక నగరాల్లో ఇదే ట్వీట్‌ను ప్లకార్డులపై రాసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కొందరు ఆయుధాలు చేత బట్టి కేంద్రాల్లో కి దూసుకెళ్లారు. వెనుకబడ్డప్పటికీ ట్రంప్‌ శిబిరంలో ఆశలు మిగిలే ఉన్నాయి. ‘‘వారం రోజుల తరువాత తెలుస్తుంది. అధ్యక్ష పదవిలో ట్రంప్‌, ఉపాధ్యక్ష పదవిలో మైక్‌ పెన్స్‌ మరో నాలుగేళ్లు అధికారంలోనే ఉండబోతున్నారని’’ అని ట్రంప్‌ తరఫు ప్రచార మేనేజర్‌ జేసన్‌ మిల్లర్‌ అన్నారు. జార్జియా, మిషిగన్‌, పెన్సిల్వేనియా కోర్టుల్లో కేసులు వేసిన ట్రంప్‌ విస్కాన్‌సన్‌లో కూడా రీకౌంట్‌ కోరారు.

లెక్కింపు పూర్తికి వారం రోజులపైనే!
స్వింగ్‌ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అధికారికంగా పూర్తవడానికి మరో వారం రోజుల పైనే పట్టొచ్చంటున్నారు. ఉదాహరణకు పోస్టల్‌ ఓట్లు చేరడానికి తుది గడువు నవంబరు 10 అని నెవాడాలోని క్లార్క్‌ కౌంటీ అధికారులు చెప్పారు. అయితే ఓ తుది అంచనా మాత్రం భారత కాలమానం ప్రకారం శనివారం నాటికి వచ్చేయవ చ్చు. పెన్సిల్వేనియా ఫలితం కూడా శనివారంనాటికి కానీ రాకపోవచ్చు. నార్త్‌ కరోలినాలో 12వ తేదీ దాకా పోస్టల్‌, ఆబ్సెంటీ ఓట్లను అనుమతిస్తున్నారు. అంటే నవంబరు 13నే తుది ఫలి తం. నవంబరు 3న జరిగిన పోలింగ్‌లో అమెరికాలో మొత్తం 16 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 120 ఏళ్ల అమెరికన్‌ చరిత్రలో ఇంత భారీ ఓటింగ్‌ ఎన్నడూ నమోదు కాలేదు. జో బైడెన్‌ 7.20 కోట్ల ఓట్లతో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ట్రంప్‌ కూడా 2016లో కంటే 40 లక్షలు అధికంగా 6.68 కోట్ల ఓట్లు సాధించారు.

Courtesy Andhrajyothi