ఎస్సీ కార్పొరేషన్‌ భూమిలో టీఆర్‌ఎస్‌ కార్యాలయమా?

నిర్మల్‌కు దగ్గర్లోని కొండాపూర్‌ వద్ద ఉన్న ఈ స్థల విస్తీర్ణం ఎకరంన్నర. ఎస్సీ కార్పొరేషన్‌ స్థలమిది. ఇక్కడ కార్పొరేషన్‌కు చెందిన పౌల్ట్రీఫాం నిర్మాణాలను కూలగొట్టి.. చదును చేశారు. ఈ స్థలాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేటాయించాలంటూ కలెక్టర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సిఫారసు చేశారు. తదుపరి చర్యలకు కలెక్టర్‌ రాసిన లేఖ మేరకు చకచకా పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఈ స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చదునుచేసే ప్రయత్నాలను మొదలు పెట్టారు. కొండాపూర్‌ దళితులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. దీంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ భూమిలో డెయిరీ ఫాం ఏర్పాటు కోసం షెడ్లు కేటాయించాలని, సబ్సిడీపై గేదెలను పంపిణీ చేయాలంటూ తాము ఎస్సీ కార్పొరేషన్‌కు వినతిపత్రాలు అందించామని, తమ విజ్ఙప్తిని పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.

(Courtacy Andhrajyothi)

Leave a Reply