హైదరాబాద్‌: సామాజిక తత్వవేత్త, బహుజన ఉద్యమకారుడు ఉ. సాంబశివరావు(ఉసా) మరణం దళిత బహుజన ఉద్యమాలకు తీరని లోటని రమణ అన్నారు. ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించి సామాజిక చైతన్యాన్ని ప్రజ్వలించే సాహిత్యాన్ని సృజించిన మహనీయుడు ఉసా అని పేర్కొన్నారు. ఆయన మరణానికి జోహార్లు అర్పిస్తూ జాషువ కల్చరల్‌ సెంటర్‌ ప్రతినిధి బొర్రా గోవర్ధన్ రాసిన గీతాన్ని రమణ గానం చేశారు.