Image result for ‘దిశ’ కేసు"నవంబరు 27 (బుధవారం)
సాయంత్రం 5.30 గంటలకు: శంషాబాద్‌లోని తన ఇంటి నుంచి గచ్చిబౌలిలోని ఆస్పత్రికి ప్రభుత్వ పశు వైద్యురాలు దిశ’(25) ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.
6.08: తొండుపల్లి టోల్‌ ప్లాజాకు దిశచేరుకుంది. ఇక్కడ పార్కింగ్‌ చేసే వీలు లేక.. మరో ప్రాంతంలో స్కూటీ పెట్టి, గచ్చిబౌలిలోని ఆస్పత్రికి వెళ్లింది.
రాత్రి 9.13 : తొండుపల్లి టోల్‌ప్లాజాకు తిరిగి వచ్చింది.
9.19 : వాహనం వద్దకు వచ్చి చూసి.. పంచర్‌ అయినట్లు గుర్తించింది. చెల్లికి ఫోన్‌ చేసి.. పరిసరాల్లో ఉన్నవారి ప్రవర్తన భయానకంగా ఉందని చెప్పింది.
9.23 : స్కూటీకి పంచర్‌ వేయిస్తానంటూ లారీ క్లీనర్‌ శివ వెళ్లాడు.
9.28 : తిరిగి వచ్చిన శివ.. పంచర్‌ దుకాణం లేదని చెప్పాడు. మరొక చోట ప్రయత్నించాలని డ్రైవర్‌ ఆరిఫ్‌ చెప్పి పంపాడు.
9.30 : మరోసారి పంచర్‌ వేయించేందుకు వెళ్లిన శివ
9.35 : తిరిగివచ్చిన శివ
9.48 : దిశ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిన సమయం
9.49-10.08 : దిశపై నలుగురు నిందితుల అత్యాచారం. నోరు, ముక్కు మూసివేయడంతో ఊపిరాడక మరణించిన దిశ.
10.28 : దిశ స్కూటీ ఘటనా స్థలం నుంచి కదిలింది.. ఆ వెనకే 10.32కి నిందితులు నడిపే లారీ కూడా కదిలింది.
అర్ధరాత్రి 12.03 : నందిగామ సమీపంలోని ఓ బంక్‌లో బాటిల్‌లో పెట్రోలు పోయించుకున్న నిందితులు
నవంబరు 28 (గురువారం)
వేకువజామున 2-2.30 : ఘటనా స్థలానికి 28.37 కి.మీ దూరంలో చటాన్‌పల్లి వంతెన కింద మృతదేహానికి నిప్పంటించిన నిందితులు
వేకువజామున 3.10 : ‘దిశసోదరి ఫిర్యాదుతో శంషాబాద్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సమాచార సేకరణ
ద్విచక్రవాహనం పంచర్‌ కావడంతో.. రిపేర్‌కు సాయం చేస్తామని ఎవరో ముందుకొచ్చారని తనకు దిశఫోన్‌ చేసి చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్న ఆమె సోదరి
ఉదయం 9 గంటలకు : 44వ నంబరు జాతీయ రహదారిపై చటాన్‌పల్లి వద్ద ఓ కల్వర్టు కింద దహనమైన ఓ మృతదేహం ఉందని షాద్‌నగర్‌పోలీసులకు సమాచారమిచ్చిన రైతు సత్యం
నవంబరు 29 (శుక్రవారం)
నారాయణపేట జిల్లాకు చెందిన నిందితులు మహ్మద్‌ అలియాస్‌ ఆరిఫ్‌(26), జొల్లు శివ(20), జొల్లు నవీన్‌(20), చింతకుంట చెన్నకేశవులు అలియాస్‌ చెన్న(20)లను అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు
నవంబరు 30 (శనివారం)
ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం చేసిన ముగ్గురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు
నిందితులున్న షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ప్రజల భారీ నిరసన
నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ
చర్లపల్లి కేంద్ర కారాగారానికి నిందితులను తరలిస్తుండగా పోలీసు వాహనాలపైకి రాళ్లు రువ్విన ప్రజలు
డిసెంబరు 1(ఆదివారం)
దిశకేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ ప్రకటన
 కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితులను 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్‌ కోర్టులో దర్యాప్తు అధికారుల పిటిషన్‌
డిసెంబరు 2 (సోమవారం)
నలుగురు నిందితులను 10 రోజుల(డిసెంబరు 3 – 12) కస్టడీకి అనుమతించిన కోర్టు
డిసెంబరు 3 (మంగళవారం)
త్వరితగతిన కేసు విచారణ కోసం మహబూబ్‌నగర్‌లోని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టును ప్రత్యేక కోర్టుగా ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
కోర్టు అనుమతించిన విధంగా 3వ తేదీన నిందితులను కస్టడీలోకి తీసుకోని పోలీసులు
డిసెంబరు 4, 5 (బుధ, గురువారాలు) నాలుగో తేదీన నిందితులను కస్టడీలోకి తీసుకొని రెండు రోజుల పాటు విచారించి, కీలక ఆధారాలు రాబట్టిన పోలీసులు
డిసెంబరు 6 ( శుక్రవారం ఉదయం 5.30- 6.15)

 ‘దిశఘటన రీకన్‌స్ట్రక్షన్‌ కోసం చటాన్‌పల్లిలో వైద్యురాలి మృతదేహం లభ్యమైన ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు అక్కడ దొరికిన కర్రలు, రాళ్లతో పోలీసులపై నలుగురు నిందితుల దాడి తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపిన ఏ1 నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌, 4 చెన్నకేశవులు పోలీసులు జరిపిన ప్రతికాల్పుల్లో నలుగురు నిందితుల మృతి, ఎస్సై, కానిస్టేబుల్‌లకు గాయాలు

(Courtesy Andhrajyothi)