BJP స్పాన్సర్డ్ అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడును కూడా ఉత్తర ప్రదేశ్ లాగా ʹరామరాజ్యంʹ చేయాలని నడుం భిగించినట్టుంది…. అందుకే అరాచకాల్లోప్రజాస్వామ్యవాదులపై కేసులు మోపడంలో యూపీతో పోటీ పడుతోంది.

సామాజిక స్ప్రుహతో సినిమాలు తీసే ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ పై అన్నాడీఎంకే పభుత్వంఓ కేసు మోపింది. ఆ కేసు ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే…కొత్తగా తమతో శిష్యరికం చేస్తున్న అన్నాడీఎంకీయులు తననే మించి పోయారని యోగీ ఆదిత్యానాథ్ కూడా ఆశ్చర్యపడేంత‌….తమిళనాడులో జూన్ 5న బ్లూ పాంతర్స్ అనే సంస్థ దళితులకోసం పని చేసిన సామిజికవేత్త ఉమర్ ఫరూఖ్ సంస్మరణ సభ నిర్వహించింది. ఆ సభకు అతిథిగా హాజరైన పా రంజిత్ మాట్లాడిన మాటలు……–   ʹʹచోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు. దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా,సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు .దేవదాసి అనే వ్యవస్థ రూపుదిద్దుకున్నది వీరి హయాంలోనే అంతే కాకుండా 26 మంది ప్రజలు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు అమ్మివేయబడ్డారు.కాబట్టి కుల సమస్య ఈనాటిది కాదు. రాజారాజా చోళన్ పాలన దళితులకు చీకటి యుగంʹʹ

BJP స్పాన్సర్డ్ అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడును కూడా ఉత్తర ప్రదేశ్ లాగా ʹరామరాజ్యంʹ చేయాలని నడుం భిగించినట్టుంది…. అందుకే అరాచకాల్లో

ప్రజాస్వామ్యవాదులపై కేసులు మోపడంలో యూపీతో పోటీ పడుతోంది.

సామాజిక స్ప్రుహతో సినిమాలు తీసే ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ పై అన్నాడీఎంకే పభుత్వం

ఓ కేసు మోపింది. ఆ కేసు ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే…కొత్తగా తమతో శిష్యరికం చేస్తున్న అన్నాడీఎంకీయులు తననే మించి పోయారని యోగీ ఆదిత్యానాథ్ కూడా ఆశ్చర్యపడేంత‌….

తమిళనాడులో జూన్ 5న బ్లూ పాంతర్స్ అనే సంస్థ దళితులకోసం పని చేసిన సామిజికవేత్త ఉమర్ ఫరూఖ్ సంస్మరణ సభ నిర్వహించింది. ఆ సభకు అతిథిగా హాజరైన పా రంజిత్ మాట్లాడిన మాటలు……

—   ʹʹచోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు. దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా,సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు .దేవదాసి అనే వ్యవస్థ రూపుదిద్దుకున్నది వీరి హయాంలోనే అంతే కాకుండా 26 మంది ప్రజలు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు అమ్మివేయబడ్డారు.

కాబట్టి కుల సమస్య ఈనాటిది కాదు. రాజారాజా చోళన్ పాలన దళితులకు చీకటి యుగంʹʹ

ఇవి పా. రంజిత్ మాట్లాడిన ఈ వాస్తవాలు ….

ʹహిందూ మక్కల్ కచ్చిʹ అనే సంస్థకు నచ్చలేదట ఆ సంస్థకు చెందిన తంజావూరు జిల్లా మాజీ కార్యదర్శి బాల రంజిత్ పై కేసు పెట్టాడు. పై వాళ్ళు చెప్పింది ఆచరించడమే తప్ప చరిత్ర తెలుసుకునే ఓపిక పోలీసులకు ఉండదు కదా అందుకే తమ ప్రభుత్వాధినేతలు చెప్పినట్టు విని రంజిత్ పై ఐపీసీ సెక్షన్ 153 (అల్లర్లకు కారణమయ్యే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం), సెక్షన్ 153 (ఏ) (1) (ఏ) (విభిన్న వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం) ప్రకారం కేసు నమోదు చేశారు……

జనాలు చరిత్ర తెలుసుకోకపోవడం మంచిదని, ఒక వేళ పొరపాటున తెలుసుకున్నా బైటికి చెప్పకుండా మనసులోనే దాచుకోవాలని పాలకుల భావన , లేదూ మనకు తెలిసిన నిజాలు మాట్లాడాల్సిందే…తప్పులను ప్రశ్నించాల్సిందే అనుకుంటే మూకల దాడులకు, పోలీసుల కేసులకు, జైళ్ళకు పోవడానికి సిద్దపడాలి. మనిషి గా  బతకాలనుకుంటే అన్నింటికీ సిద్దపడాలి కదా !