జీవో నెం.3 చట్టబద్ధతకు డిమాండ్‌
ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి: టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు

ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసులకు అందేలా ఉన్న జీవో నెం. 3కు చట్టబద్ధత కల్పించాలని టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా టీఏజీఎస్‌ (తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) ఆధ్వర్యంలో చేపట్టిన మన్యం బంద్‌ విజయవంతమైంది. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ కేంద్రం ఉట్నూర్‌తో పాటు ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బేల మండలాలు, ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, జైనూర్‌, కెరమెరి కేంద్రాల్లో బంద్‌ ప్రభా వం కనిపించింది. ఉట్నూర్‌లో టీఏజీఎస్‌ నాయకుడు మడావి నాగోరావు నాయక త్వంలో బంద్‌ జరిగింది. దుకాణాలను టీఏజీఎస్‌ నాయకులు, కార్యకర్తలు మూ యించారు. ఈ సందర్భంగా జీఓ నెం.3కు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు, నాయకులు బొజ్జ ఆశన్న పాల్గొన్నారు.

ఇచ్చోడలో టీఏజీఎస్‌ జిల్లా కార్యదర్శి పూసం సచిన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ అతికొద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 22న సుప్రీం కోర్టు జీఓ నెం.3ని కొట్టి వేస్తూ ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇంద్రవెల్లిలో జరిగిన బంద్‌లో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో తుడుండెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, కోరెంగ సుంకట్రావ్‌, టీఏజీఎస్‌ మండల కార్యదర్శి మెస్రం మనోహర్‌, గిరిజన నాయకులు పూసం గణేష్‌, గెడం రమేష్‌ పాల్గొన్నారు. బేల మండలం లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అర్ధనగంగా నిరసన తెలిపారు. టీఏవీఎస్‌ జిల్లా కార్యదర్శి ఆత్రం కిష్టన్న టీఏవీఎస్‌, టీఏజీఎస్‌ నాయకు లు ఆత్రం నగేష్‌, కోవ సిద్ధార్థ్‌, కుమ్ర జుగాదిరావ్‌, మోరేశ్వర్‌, మద్దె శ్రీనివాస్‌, రామన్న, పొచ్చిరాం, దశరథ్‌ పాల్గొన్నారు.

ఆదివాసీ సంఘా ల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన మన్యం బంద్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సక్సెస్‌ అయింది. బంద్‌కు అన్ని వ్యాపార వర్గాలు సహక రించడంతోపాటు దుకాణ సముదాయాలు, బ్యాంకు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం మూతపడ్డాయి. ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన ప్రజా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ఈ బం ద్‌కు మద్దతుగా సీపీఐ(ఎం) పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

Courtesy Nava Telangana