అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలంటూ కేంద్రం మెలిక  26 లక్షల మంది లబ్దిదారులపై ప్రభావం న్యూఢిల్లీ : టీబీ రోగుల

పోషకాహారం కోసం వారికందే కొద్దిపాటి నగదు సాయాన్ని మోడీ సర్కారు నిలిపివేసింది. ఇప్పటి వరకూ ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా లబ్దిదారుడి ఖాతాలోకి రూ. 500 నగదు చేరేది. ఇది వారీ పోషణకాహార ఖర్చుకు ఉద్దేశించిన ఆర్టీక సాయం. అయితే బ్యాంకు లావాదేవీల్లో అక్రమాలు, లబ్దిదారుడికి బదులు వేరొకరీ ఖాతాలు అనుసంధానించి ఉన్నాయంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గుర్తించింది. కాగా, కేంద్రం మెలికతో పథకం కింద టీబీ పేషెంట్లకు కింద అందే ఆర్థికసాయం కొన్ని వారాలే కిందటే నీలిచిపోయింది. ఈ విషయాన్ని ఆ శాఖలోని ఉన్నతాధికారులు ధ్రువీకరించినట్టు ఓ వార్తా సంస్థ పేర్కొన్నది.

2018లో ‘నీక్షయ్ పోషణ్ యోజన’ను కేంద్రం ప్రవేశపెట్టింది. నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా లబ్దిదారులకు నగదు చేరేలా చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం, అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని కేంద్రం భావించినప్పటికీ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. పథకాన్ని పటిష్టం గా అమలు చేయడంలో మోడీ సర్కారు విఫలం చెందడంతో దాని ప్రభావం టీబీతో బాధపడుతన్న రోగులపై పడుతోంది. కేంద్రం నిర్ణయంతో పథకం కింద అర్హులైన దేశంలోని దాదాపు 26 లక్షల మంది టీవీ రోగులపై ప్రభా వం పడనున్నది. లబ్దిదారులకు అందే నగదు లావాదేవీల్లో దాదాపు 2300 కేసుల్లో అక్రమాలు కేంద్రం దృష్టికి వచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ లెక్కలప్రకారం.. 2018 ఏప్రిల్ నుంచి 2019 జులై మధ్య దాదాపు 24.46 లక్షల మంది టీబీ పేషెంట్లకు నగదు సాయం అందింది. 2018-19 బడ్జెట్లో ఈ పథకం కోసం రూ. 600 కోట్లను కేంద్రం కేటాయించింది.

ఈ ఏడాది జనవరి నాటికి కేవలం 52శాతం మంది టీబీ పేషెంట్లు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించారు. అయితే వాస్తవానికి అందు లో 45శాతం మంది(9.47 లక్షల మంది) మాత్రమే ప్రయోజనాన్ని పొంద డం గమనార్హం. అయితే 90 నుంచి 95శాతం మంది టీబీ రోగులు పడకం కింద ప్రయోజనాన్ని పొందుతున్నారని తెలియజేస్తున్నది. పథకంలో ఈ అవకతవకలకు నకిలీ రోగులు కానీ, ప్రభుత్వ అధికారుల ప్రమేయంకానీ, తప్పుడు సమాచారాన్ని పొందుపర్చడం కానీ కారణాలు అయ్యుండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. 2025 నాటికి దేశంలో టీబీ మహమ్మారీని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీ సర్కారు.. దాని కోసం ఉద్దేశించి న పథకాన్నే అమలు చేయడంలో ఆపసోపాలు పడుతుండటం గమనార్హం.

                                                                                    Courtesy Navatelangana..