• బిగ్‌బాస్‌ చూస్తున్నాడు
  • పోసిడెక్స్‌ వెనుక ఈఎస్‌డీ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ రావు
  • ఆ సంస్థలోని కీలకస్థానాల్లో ఆయన కుటుంబసభ్యుల
  • ఉద్యోగం వదిలి పోసిడెక్స్‌లో చేరిన ఉన్నతాధికారి

పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌.. డేటా మైనింగ్‌, డేటా ఎనలిటిక్స్‌తో గరిష్ఠంగా ఎంతమేరకు లబ్ధి పొందవచ్చో నిరూపించిన సంస్థ. ఈ ప్రత్యేకతలతోనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించిన పోసిడెక్స్‌.. మూడేళ్లుగా రాష్ట్రప్రభుత్వానికి ఐటీ రంగంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. పేరు చెప్తే.. చరిత్ర చెప్పేస్తా అని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ గతంలో చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్నది ఈ సంస్థేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. అసలు ఈ సంస్థ ఎవరిది? దీని వెనుక ఎవరున్నారు? అన్న విషయాలను పరిశోధిస్తే.. అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

రాష్ట్ర ఐటీ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈఎ్‌సడీ (మీసేవ) డైరెక్టర్‌ గౌరవల్లి వెంకటేశ్వర్‌ రావు కుటుంబసభ్యుల సారథ్యంలోనేపోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ నడుస్తోందని ఆంధ్రజ్యోతి పరిశోధనలో తేలింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) 1990 బ్యాచ్‌కి చెందిన గౌరవల్లి వెంకటేశ్వర్‌ రావు 2015 ఆగస్టు నుంచి.. డిప్యూటేషన్‌పై తెలంగాణకు వచ్చారు. ప్రారంభం నుంచి ఈఎ్‌సడీ (మీసేవ) కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసె్‌సకు (టీఎ్‌సటీఎస్‌) ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ ఉన్నారు. పోసిడెక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పరిచయం చేయడం వెనక ఈయన పాత్రే కీలకమని తెలుస్తోంది. తాను అభివృద్ధి చేసిన పరిజ్ఞానం వల్ల ఏ విధంగా లబ్ధి కలుగుతుందనే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, తన ఆలోచనలను ఈ కంపెనీ ద్వారా అమలుచేస్తున్నట్లు సమాచారం. మూడేళ్ల నుంచి ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థ సేవలు అందుకుంటున్న శాఖల్లో జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, ఆదాయ పన్ను శాఖ, తెలంగాణ ఐటీ శాఖలున్నాయి.

ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా రిజిస్టర్‌ అయిన పోసిడెక్స్‌లో వెంకటేశ్వర్‌రావుకుటుంబ సభ్యులే కీలక స్థానాల్లో ఉన్నారు. ఆయన సోదరుడు, అమెరికా పౌరసత్వం కలిగిన వేణుగోపాల్‌ గౌరవెల్లి ప్రస్తుతం పోసిడెక్స్‌ సారథిగా ఉన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఆయన.. సంస్థ సహ వ్యవస్థాపకుడుగా, చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా ఉన్నారు. మరో కుటుంబసభ్యుడు గౌరవెల్లి శరత్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉన్నారు. రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీకి సమర్పించిన జాబితాలో గౌరవెల్లి లీలాకుమారి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈమె వెంకటేశ్వర్‌ రావు తల్లి.

డిప్యూటీ ఈఈ ఉద్యోగం వదిలి…..పోసిడెక్స్‌ కంపెనీలో మీసేవ డైరెక్టర్‌ గౌరవల్లి వెంకటేశ్వర్‌ రావు కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితుడు.. పంచాయతీరాజ్‌ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన కందిమల్ల వెంకట్‌ రెడ్డి కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017 మే 31న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరకాస్తు చేసుకుని.. ఉద్యోగాన్ని వదులుకుని మరీ కంపెనీలో చేరారు. పోసిడెక్స్‌ టెక్నాలజీ్‌సలో తనకు డైరెక్టర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ హోదా ఇస్తామన్నారని, తనకు అనుకూలంగా వర్క్‌ ఫ్రం హోం (ఇంటినుంచే విధులు నిర్వహించే) అవకాశం ఇచ్చారని ఆయన ప్రభుత్వానికి రాసిన దరఖాస్తులో తెలిపారు.

ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను తాను అంగీకరించానని, ఉద్యోగాన్ని వీడి పోసిడెక్స్‌లో చేరేందుకు అనుమతించాలని అందులో కోరారు. ఈ మేరకు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 15న ఆయన వీఆర్‌ఎ్‌సను అంగీకరించింది. దీనికోసం ప్రత్యేకంగా జీవో ఆర్టీ నెంబరు 685ను వెలువరించింది. ప్రభుత్వం ఉత్తర్వు వెలువడిన ఐదు రోజుల అనంతరం.. అంటే 2018 సెప్టెంబరు 20న ఆయన పోసిడెక్స్‌లో జీవితకాల డైరెక్టర్‌గా చేరారు.

Courtesy Andhrajyothi..