హైదరాబాద్‌: నగరంలోని బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యకు యత్నించారు. సమీపంలోని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్సైను సహచరులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాలాపూర్‌ నుంచి మంచాల పీఎస్‌కు నరసింహను బదిలీ చేశారు. ఈ బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఏఎస్సై నరసింహ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు.

Courtesy Eenadu…