స్పెయిన్‌ : స్పెయిన్‌ దేశంలోని బాసక్యు ప్రాంతంలోని సైడ్‌నార్‌ స్టీల్‌ కార్మికులు సమ్మెకు పునుకున్నారు.  స్పెయిన్‌లో 6802 మంది కరోనా సోకి చనిపోయినా యాజమాన్యం, యూనియన్‌, ప్రభుత్వం కార్మికులను ‘పనులకు తిరిగిరండి’ అని ఇచ్చిన పిలుపును వారు నిరసిస్తూ సమ్మెకు దిగారు. రక్షణ ఏర్పాటు లేని పనిస్థలాలల్లో ప్రాధాన్యత లేని పనులు ఈ అత్యవసర పరిస్థితిలో ఎందుకు చేయాలని వారు నిరసనకు పూనుకున్నారు. దేశంలోని ఐక్య సంఘటన ప్రభుత్వంలో సోషలిస్టు పార్టీ కూడా భాగస్వామం వహిస్తున్నా కార్మికులు మీదకు పోలీసులను పురికొల్పారు. చాలా మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులు పోలీసులపై తిరగబడి మాతో పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా ఆరోగ్యం గురించి మీకు పట్టింపు లేదా పని స్థలాలు వచ్చి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో మీకు అర్థం అవుతుంది అని ప్రశ్నించారు. ఆదేరోజు స్పెయిన్‌లో 832 మరణాలు సంభవించాయి అదే ఆ దేశంలో ఒక రోజులో అత్యధిక మరణాలు నమోదు అయిన రోజు కావడం ప్రత్యేకంగా చెప్పకోవాలి. అదే రోజు నుంచి ప్రభుత్వం అందరూ ఏప్రిల్‌ 9వరకు ఇండ్లకే పరిమితం కావాలని ప్రకటన చేసింది.ఇప్పటికే అమెరికాలో కార్ల పరిశ్రమ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, అమోజన్‌ కార్మికులు పనిస్థలాలను బంద్‌ చేశారు. బ్రిటీషు పోస్టల్‌ కార్మికులు, ఫ్రాన్స్‌లో బస్సు డైవర్స్‌, ఆటో కార్మికులు, ఫియెట్‌ కార్ల కార్మికులు కెనడాలో, స్పెయిన్‌లో ఎయిర్‌ బస్సు, మెర్సిడెజ్‌ బెజ్జ్‌, సిమెంట్‌, నిస్సాన్‌ కార్మికులు పనులు మానుకున్నారు. స్పెయిన్‌లో సోషలిస్టులమని చెప్పకునే వారే కార్మికుల మీదకు పోలీసులను ఎగతోయడం చూస్తుంటే కార్మికులకు ఇది ఒక హెచ్చరికలా ఉన్నది.

Courtesy Nava Telangana