• కింద పడేసి ముఖంపై పిడిగుద్దులు
  • విధుల నుంచి తప్పించిన సీఎం

భోపాల్‌ : గృహహింసకు పాల్పడుతూ మధ్యప్రదేశ్‌లోని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అడ్డంగా బుక్కయ్యారు. భార్యపై దాడి చేస్తూ ఏకంగా ఆ రాష్ట్ర డీజీపీ (ప్రాసిక్యూషన్‌) పురుషోత్తంశర్మ కెమెరా కన్నుకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పురుషోత్తంశర్మ..తన భార్యను కొట్టి, కింద పడేసి, ముఖంపై పిడిగుద్దులు గుద్దుతున్న దృశ్యాలు ఆ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని.. తన తల్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందని, ఆ ఉక్రోషంతోనే ఆమెపై దాడికి దిగారని ఆమె కుమారుడు తెలిపారు. తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. కాగా తాను అంతగా హింసిస్తుంటే.. 32 ఏళ్లుగా ఆమె తనతో ఎలా కాపురం చేయగలిగిందో తన కుమారుడు చెప్పాలని పురు షోత్తం శర్మ అన్నారు. తన ద్వారా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తూ త ననే వేధిస్తోందని, తనకు తెలియకుండా కెమెరాలు అమర్చిందని భా ర్యపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. పురుషోత్తంశర్మను విధుల నుంచి తప్పించారు.

Courtesy Andhrajyothi