కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రపంచ కార్మికవర్గ వర్గంతో పాటు భారతదేశంలోని బహుజన శ్రామిక వర్గానికి కూడా అవసరమేనని ఈ రోజు గుంటూరు అరండల్పేటలోని అమరావతి మీడియా సెంటర్లో జరిగిన మార్క్స్ 201జయంతి గోష్టిలో ముఖ్యవక్తగా ఉద్యమాల ఉపాధ్యాయుడు “ఉసా “చెప్పారు. ఈ గోష్టికి పూలే-అంబేద్కర్-మార్క్స్ వాదుల రాజకీయ వేదిక రాష్ట్ర కన్వీనర్ “వైకె “అధ్యక్షత వహించారు. ప్రారంభంలో మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి  నివాళలర్పించారు.

Usaa – (U.Samabasiva Rao)
Karl marx 201 Birth Anniversary

ఉసా తన విశ్లేషణల్లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను కారల్ మార్క్స్ ఏ విధంగా విశ్లేషించారో వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలమే గాక తదనానంతర వర్గ రహిత సమాజ స్థాపన వరకు నిలిచి  ఉంటుందన్నారు. ఐన్స్టీన్ సిద్ధాంతం ఏ విధంగా శాస్త్రమెా, కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలోని అంశాలకు కూడా కాలపరిమితి లేదు అని ఉసా సాంబశివరావు (ఉసా)చెప్పారు.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక రచనకు సంబంధించిన అనేక అంశాలను,శ్రామికవర్గం ప్రాముఖ్యతని ప్రణాళికలో శాస్త్రీయంగా విశ్లేషించారని వైకే తెలియజేశారు. కుల వ్యవస్థ వేళ్లూనుకుని ఉన్న భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడటమే కాక కార్పొరేట్ శక్తిగా మారుతున్న సమయంలో  జ్యోతిరావ్ పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల సిద్ధాంతాలతో పాటు కారల్ మార్క్స్ సిద్ధాంతాలను కూడా బహుజనులు తమ పోరాటంలో శాస్త్రం గానే గాక, శస్త్రంగా కూడా ఉపయోగపడుతుందని వైకే చెప్పారు .

Karl marx 201 Birth Anniversary

ఈ చర్చా గోష్టిలో రాష్ట్ర కమిటి సభ్యులు పివి రమణయ్య ,సిపిఐ న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య ,KNPS జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్,బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు  ఆనందబాబు , న్యాయవాది సైకం రాజశేఖర్, SFI నాయకులు భగవాన్, మనోజ్ : SDPI చెరబండ రాజు , ప్రసన్న కుమార్, సాదు మాల్యాద్రి,ఫూలే కళామండలి కొల్లూరు నాగేశ్వ రావు గారు తదితరులు పాల్గొన్నారు.

YK, Advocate