– టి.స్కైలాబ్‌బాబు

త్యాగం, సేవ, క్రమశిక్షణ, పట్టుదలకు మారు పేరుగా నిలిచిన మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయిఫూలే. సమాజంలో కులతత్వ, పురుషాధిక్య ధోరణులు కలిగిన పండిత మేధావులందరికీ ఆమె కేవలం జ్యోతిబాఫూలే భార్యగానే తెలుసు. కానీ ఆమె పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి తుదిశ్వాస వరకూ అవిశ్రాంత కృషి చేసిన అసామాన్య ఉద్యమకారిణి. గొప్ప రచయిత్రి, మంచి వక్త. కులం, పితృస్వామ్యంపై కలంతో యుద్ధం నడిపిన కవ యిత్రి. యుక్త వయస్సులోనే తన సౌఖ్యాలను వదులుకొ ని శూద్రులకు, దళితులకు ఆధిపత్య కులాల్లోని మహిళల కు సైతం విద్యాభ్యాసం నేర్పిన గొప్ప మానవి. స్త్రీలకు, పురుషులకు, కుల మతాలకతీతంగా విద్య నేర్చుకోవడం సహజమైన హక్కుగా ఉంటుందనీ, అందుకు అందరూ చదవాలనీ, అందరూ అసమానతలు లేకుండా బతకాలనీ పరితపించిన వీరనారి సావిత్రిబాయిఫూలే. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగామ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో సా విత్రిబాయి జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సు లోనే జ్యోతిరావు ఫూలేను వివాహమాడింది. నిరక్షరాస్యులైన సావిత్రిబాయి ఫూలేకు తన భర్త జోతిబాఫూలే మొదటి గురువుగా విద్యా, జ్ఞానం నేర్పి సామాజికోద్యమ కారిణిగా తీర్చిదిద్దారు. 1847 నాటికి తన భర్త తో కలిసి శూద్ర కులాల బాలికల కోసం పూనేలో మొదటి పాఠశాలను ప్రా రంభించారు. న్యాయం, ప్రజాస్వామ్యం, స్త్రీ, పురుష సమానత్వం అనే ఆదర్శాలు సావిత్రీ బాయి ఫూలే జీవితంలో సహజ గుణాలుగా నిలిచిపోయిన గొప్ప లక్షణాలు. 19వ శతాబ్ధం లో కుల వ్యతిరేక, పురుషాధిక్య వ్యవస్థపై జరిగిన పోరాటాల్లో సావిత్రిబాయి ప్రత్యక్షంగా పాల్గొన్నది. నాటి సామాజికోద్యమాలలో మ హిళా ఉద్యమకారిణిగా కనిపించే ఏకైక వ్యక్తి సావిత్రిబా యి. ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉన్న ఉద్యమాలకు ప్ర త్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో పీడితుల పక్షాన ఆ మె అగ్రభాగాన నిలిచారు. 1852లోనే మహిళా సేవా మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితం తువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. అనాథ బాలలు, శూ ద్ర బాలికలు అందరూ తన బిడ్డలని అక్కున చేర్చుకు న్నారు. 1874లో ఓ బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డ ను ఫూలే దంపతులు దత్తత తీసుకొని పెంచి పోషించా రు. 1873లో సత్యశోద క్‌ సమాజ్‌ మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు జరిపించారు. భార్యను కోల్పోయిన ఓ యువకుడిని చేరదీసి తన స్నేహితురాలి బిడ్డతో మాట్లాడి పెండ్లి చేసారు. పురోహితులై పైసా ఖర్చు లేకుండా వివాహం జరిపించారు.

తన భర్తకు తోడు నీడగా నడవడం మాతమ్రే గాక, స్వయంగానే ఆమె ఓ సామాజిక విప్లవానికి ఓ మహిళగా సారథ్యం వహించింది. 19వ శతాబ్దంలో ఆమె సాగించి న కృషి… కులం, వర్గం, లింగ వివక్ష వంటి శక్తులన్నీ తల వంచక తప్పని పరిస్థితికి తెచ్చింది. వితంతువులెందరికో వివాహాలు జరిపించింది. సత్యశోదక్‌ సమాజ్‌ పేరిట ఆమె అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నడిపింది. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జన జీవనాన్ని అతలాకుతలం చేనప్పుడు దళితులు, పేదల కోసం ఆమె జోలె పట్టి విరాళాలు సేక రించి వారికి అందించింది. ప్లేగు వ్యాధి బాధితులందరికీ దగ్గరుండి సేవలందించింది. 1848లో మొట్టమొదటి సారిగా కేవలం 9మంది విద్యార్థినులతో ఒక బాలికా పా ఠశాలను ఒక పేద వ్యక్తి ఇంట్లో పూలే ప్రారంభించారు. సావిత్రిబాయి తన స్నేహితురాలు ఫాతిమా షేక్‌ ఇరువు రు కలిపి ఆ పాఠశాలను చాలా సమర్థవంతంగా నడిపా రు. శూద్రులు అందులోనూ మహిళలు చదవడం అపచా రమంటూ ఆనాటి ఆధిపత్య శక్తులు అనేక ఆటం కాలు సృష్టించారు. ఆమె రోజు పాఠశాలకు వెళ్లే దారిలో అటకా యించి మట్టి, పేడ, రాళ్లు విసిరేవారు. వేధింపులకు గురి చేయడమే కాక, నా నా బూతులు తిట్టే వారు. అయినప్పటి కీ ఓ పాత చీర కట్టు కొని మరో చీర సం చిలో పెట్టుకుని పో యి మరీ చదువు నే ర్పిన సాహసి ఆమె.

సావిత్రిబాయి ఫూలే గొప్ప కవయిత్రి, రచయిత్రి. ని ష్కల్మషమైన మనస్సు, త్యాగం, సేవ, నిబద్ధతల కలబో త. 1854లో మొట్టమొదటిసారిగా కావ్య ఫూలే అనే ఒక కవితా సంపుటిని ఆమె రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి పీష్వాల పరిపాలనపై యుద్ధం ప్రకటిస్తూ నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా రాసింది. సూటి గా, సరళంగా ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింభిం చే కావ్య రచనలు చేసింది. 1891లో ప్యాన్‌ కాషీ సుబో ధ రత్నాకర్‌ పేరిట 11 సంపుటాలను ఆమె రచించారు. పండుగలు, పబ్బాలు, వివాహాలు వంటి వాటి కోసం ఆ ర్భాటంగా శక్తికి మించిన ఖర్చులు పెట్టవద్దని, అప్పుల పాలు కావొద్దని కర్జ్‌ అనే వ్యాసం ఆమె రాశారు. మూఢ విశ్వాసాలు నమ్మినంత కాలం ప్రజల జీవితాల్లో మార్పు లుండవని, ప్రతిదానిని హేతుబద్ధంగా ఆలోచించాలని ఆమె సూచించారు. 1890 నవంబర్‌ 28న జ్యోతిబాఫూ లే మరణించగా సావిత్రీ తన భర్త చితికి నిప్పంటించారు. అనంత రం సత్యశోదక్‌ సమాజ్‌ మొత్తం బా ధ్యతలన్నింటినీ ఆమే స్వయం గా నిర్వహించారు. ఎస్పాడ్‌లో ఒ క సంస్థ తరఫున ఒక సభ నిర్వ హించారు. 1896లో కరువు సం భవించినప్పుడు ప్రభుత్వంతో పోరాడి బాధితుల కోసం నిధులు మంజూరు చేయించారు. ప్లేగు వ్యాధి సోకిన బాధితులకు ప్రత్యక్షంగా సేవల ందిస్తున్న సమయంలో ఆమె కూడా ప్లేగు వ్యాధికి గురయ్యారు. చి వరికి 1897 మార్చి 10న ఆమె కన్ను మూశారు. కుమా రుడు యశ్వంత్‌ ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

విద్యా, వైద్యం, సమాన అవకాశాలు, ప్రకృతి వన రులు ప్రజలందరికీ అందాలని సావిత్రిబాయి జీవితాం తం కృషి చేసింది. కానీ ఆమె ఆశయాలకు తిలోదకాలి స్తున్న నేటి పాలకులు విద్యను సంతలో సరుకులా అమ్ము కుంటున్నారు. యూనివర్శిటీలను ప్రైవేటుపరం చేస్తూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో సంపూర్ణం గా ఛాందస భావాలను నింపుతోంది. దేశ సమైఖ్యత, స మగ్రతలకు భంగం కలిగిస్తూ ప్రజల మధ్య అనేక చిచ్చు లు పెట్టి అగాధాన్ని సృష్టిస్తోంది. చరిత్ర, సామాజిక శా స్త్రాల ను సమాధి చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వి ధంగా పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. ఆర్థిక సంక్షోభం తో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఒక క్రమ పద్ధతి లో పక్కదోవ పట్టిస్తోంది. నిరుద్యోగం, ఉపాధి, వ్యవసా య సంక్షోభం, కార్మికుల కనీస వేతనాలు, పెద్ద నోట్ల ర ద్దు, జీఎ స్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం రద్దు వంటి అనే క సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తూ శబరిమలై, అ యోధ్య, కాశ్మీర్‌, 370 ఆర్టికల్‌ రద్దు, పౌరసత్వ సవరణ వంటి రాజ్యాంగ పునాదులను దెబ్బతీసే కుట్రలకు తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా మని వాగ్దానం చేసి, నేడు 12వేల ప్రభుత్వ పాఠశాలల ను మూసివేస్తామని ప్రకటించింది. 5 కి.మీ. దూరానికి పాఠశాల ఉండాలని విషమ షరతులు పెడుతున్న ప్రభు త్వం, బజారుకో బ్రాందీషాపున్నా ఫర్వాలేదని అంటోంది. సావిత్రీబాయి జీవిత లక్ష్యం సాధించాలనుకునే ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయా లి. ఆమె ఆచరణ, ఆమె స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. అందరికీ కామన్‌ స్కూల్‌ ఉండే విధంగా, అందరికీ సమా న విద్య అందే విధంగా పోరాడాలి. ఆమె పుట్టిన రోజు జ నవరి 3ను మహిళాఉపాధ్యాయ దినంగా, బాలికా అక్షరా స్యతా దినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. ఆధునిక భారతదేశానికి ఆమె ఆదర్శంగానే నిలుస్తోంది.

(Courtesy Nava Telangana)