మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించటంలోనూ, బాధితులను ఓదార్చ టంలోనూ మహిళా టీచర్లు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు కచ్చితంగా ఉండేలా చూడటంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు.

దశాబ్దాలుగా పాతుకుపోయిన సామాజిక బంధనాలు మహిళలు స్వతంత్రంగా స్వతంత్రంగా ఆలోచించకుండా ఆటంకంగా మారాయని చెన్నై హైకోర్టు అడ్వకేట్‌ నిర్మలారాణి వాపోయారు. కుల దురహంకార హత్యల నివారణ కోసం తక్షణమే చట్టాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడులోని దిండిగల్‌లో అఖిల భారత ఉపాధ్యాయుల సమాఖ్య(ఎస్‌టీఎఫ్‌ఐ) అనుబంధ సంఘమైన ఎన్‌ఎఫ్‌డబ్ల్యూటీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ స్థాయి మహిళా టీచర్ల నాయకత్వ శిక్షణా తరగతులు బుధవారం కూడా కొనసాగాయి. టీఎస్‌యూటీఎఫ్‌ ఉపాధ్యక్షులు సీహెచ్‌ దుర్గాభవాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ‘ఇనిస్టిట్యూషనల్‌ రైట్స్‌ ఆన్‌ ఉమెన్‌’ అనే అంశంపై నిర్మలారాణి మాట్లా డారు. మహిళలు లైగింకంగానే కాకుండా కుల, మత పరంగానూ వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. పితృస్వామ్య, ఆధిపత్య ధోరణులతోనే సమాజంలో గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతులవారి పై సామూహిక లైంగికదాడులు పెరిగిపోతున్నాయన్నారు. మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించటంలోనూ, బాధితులను ఓదార్చ టంలోనూ మహిళా టీచర్లు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు కచ్చితంగా ఉండేలా చూడటంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కమిటీ లు వేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకునేలా పోరాడాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు చొరవ తీసుకుని ఆడపిల్లలు తమకు నచ్చని విషయాల్లో నో అని చెప్పే స్వేచ్ఛను, ధైర్యాన్ని కుటుంబ సభ్యులు కల్పించేలా ప్రోత్సహించాలన్నారు. రాజ్యాంగంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న చట్టాలపై టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌. శారద మాట్లాడుతూ…నూతన ఆర్థిక విధానాల కారణంగా మహిళలపై వినిమయదారితత్వ ప్రభావాలు, వాటి బారిన పడకుండా వారిని ఎలా చైతన్యపర్చాలి అనే విషయాలను వివరించారు.
ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా అంశాలపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జ్యోతి అతిథులను వేదికపైకి ఆహ్వానించగా…మరో ప్రతినిధి ఆర్‌. కల్పన వందన సమర్పణ చేశారు. రెండు రోజుల పాటు జరిగిన శిక్షణాతరగతుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన రాష్ట్ర బృందం ప్రదర్శించిన బతుకమ్మ ఆట అందరినీ ఆకర్షించింది.

చెన్నై హైకోర్టు న్యాయవాది నిర్మలారాణి
Courtesy Navatelangana…