– తండ్రులకు కూడా వర్తించేలా ఫిన్‌లాండ్‌ సర్కారు ఉత్తర్వులు

హెల్సింకి: ఫిన్‌లాండ్‌లోని మహి ళల సారథ్యం లోని కొత్త సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తల్లులకు మాత్రమే ఇచ్చే పేరెంటల్‌ లీవ్‌(తల్లిదండ్రుల సెలవు)ను ఇకపై తండ్రులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయిం చుకుంది. ఈమేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఉద్దేశించి సనా మారిన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తల్లికి 164రోజులతో పాటు తండ్రికి 164 రోజులు సెలవు ఇవ్వనున్నారు. ఇద్దరికి చెల్లింపు భత్యం కూడా పెరుగుతుంది. లింగ సమానత్వాన్ని, ప్రగతిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఆరోగ్యం, సామాజిక వ్యవహారాల మంత్రి ఐనో-కైసా పెకోనెన్‌ మాట్లాడుతూ…మొదటి నుంచి తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుటుంబ ప్రయోజనాల సమూల సంస్కరణ ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం ఫిన్లాండ్‌ లో ఉన్న సిస్టమ్‌ ప్రకారం…4.2నెలలు మెటర్నటీ సెలవు ఇస్తారు. బిడ్డకు రెండేండ్లు వచ్చే సమయంలోపు తండ్రికి 2.2నెలలు సెలవులు ఇస్తారు. ఆ పైన, మరో ఆరు నెలల తల్లిదండ్రుల సెలవును పంచుకోవచ్చు.

అయితే సగటున నలుగురు తండ్రులలో ఒకరు మాత్రమే వారికి ఇచ్చిన వాటిని తీసుకుంటారు. ప్రస్తుత ప్రణాళికలు ఇప్పుడు తల్లిదండ్రుల సెలవు గురించి మాత్రమే మాట్లాడుతాయి. ప్రతి తల్లి, తండ్రికి 6.6 నెలల సెలవు లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు అదనపు నెలల అలవెన్స్‌ లభిస్తుంది.

తల్లిదండ్రులు తమ కోటాలోని 69 రోజులు బదిలీ చేయడానికి అనుమతిస్తారు. సింగిల్‌ పేరెంట్స్‌ రెండు అలవెన్స్‌ లను ఉపయోగించడానికి అనుమతిస్తారు. లింగ సమా నత్వం సాధించడానికి తమ దేశానికి ఇంకా కొంత మార్గం ఉందని, చాలా తక్కువ మంది తండ్రులు చిన్నతనంలోనే తమ పిల్లలతో గడుపుతున్నారని గత వారం ఫిన్లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబర్‌ లో 34ఏండ్ల మారిన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డ్‌ సృష్టించారు.1985లో జన్మించిన మారిన్‌ ఒంటరి తల్లి దగ్గర పెరిగారు. ఆమె తన కుటుంబంలో విశ్వవిద్యాలయంలో చదివిన మొట్టమొదటి వ్యక్తి కూడా కావడం గమనార్హం.

Courtesy Nava Telangana