• అనుమతి 20 పడకలకు.. ఉన్నవి 58
  • పై అంతస్తులో రేకుల షెడ్డే ఐసీయూ
  • ప్రభుత్వానికి విచారణాధికారి నివేదిక
హైదరాబాద్‌: ఐసీయూలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని.. ఆ ఆస్పత్రిలో అన్నీ ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులకు విరుద్ధంగానే ఉన్నాయని విచారణాధికారి నివేదిక

ఇచ్చారు. ఆ నివేదికలో ముఖ్యాంశాలు..

  • ఆస్పత్రి భవనంలోని పై అంతస్తులో రేకుల షెడ్డులో ఐసీయూని ఏర్పాటు చేశారు. అందుకు అది అనుకూలమైన స్థలం కాదు.
  • ఐసీయూలో రిప్రిజిరేటర్‌, దానిపైనే ఎయిర్‌ కండిషనర్‌ ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌కు అదే ప్రధాన కారణం.
  • వైద్య ఆరోగ్య శాఖ నుంచి 20 పడకలకు అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన ఈ ఆ స్పత్రిలో.. 58 పడకలను నిర్వహిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం.
  • భవనం కొలతలు జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం లేవు. ఆస్పత్రికి ప్రవేశమార్గమే.. నిష్క్రమణ మార్గం కూడా. అది తప్ప బయటకు వెళ్లడానికి మరో మార్గం లేదు. ఇది కూడా నిబంధనల ఉల్లంఘనే.
  • ఆస్పత్రికి తగ్గట్లుగా నీటి నిల్వలు అందుబాటులో లేవు.
  • ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ రెన్యువల్‌ చేయించుకోలేదు.
షైన్‌ ఆస్పత్రి రిజిష్ట్రేషన్‌ రద్దు
నిర్లక్ష్యంతో నాలుగు నెలల శిశువు మృతికి కారణమైన షైన్‌ ఆస్పత్రి రిజిష్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి ఇటువంటి కేసుల్లో ముందుగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చి… అనంతరం చర్యలు తీసుకుంటారు. కానీ జరిగిన సంఘటన తీవ్రత, ఆస్పత్రిలో అన్నీ అనుమతులకు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Courtesy Andhra Jyothy..