చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ, ఆమె బంధువులు ఇలవరసి, సుధాకరన్‌కు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను జప్తు చేసుకున్నట్లు ఆదా యపు పన్నుల శాఖ ప్రకటన జారీ చేసింది. 2017 లో శశికళ, ఆమె బంధువులకు చెందిన నివాసగృహా లు, కార్యాలయాల్లో ఒకే సమయంలో 187 చోట్ల ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తని ఖీలు జరిపారు. ఆ తనిఖీల్లో శశికళ, బంఽధువులు బినామీ సంస్థలు నడిపి రూ.1500కోట్ల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు కనుగొన్నారు. ఆ తర్వా త అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపి గతేడాది నవంబర్‌లో రూ.1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శశికళ, ఆమె బంధువులు ఇలవరసి, సుధాకరన్‌కు చెందిన రూ.2 వేల కోట్ల  ఆదాయపు పన్నుల శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Courtesy Andhrajyothi