వందల మందికి ప్రత్యక్షంగా… వేలమందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని భావిస్తే పరిస్థితి తలకిందులైంది. సెజ్‌ల కోసం ఇచ్చిన భూముల్లో తుప్పలు మొలుస్తున్నాయి. తెచ్చిన యంత్రాలకు తుప్పు పడుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రాజీవ్‌గాంధీ నానో టెక్నాలజీ పార్కు(ఫ్యాబ్‌సిటీ)లో అన్ని సెజ్‌లకూ కలిపి ప్రాజెక్టు ఏరియా కింద 640 ఎకరాలు, మాస్టర్‌ప్లాన్‌ కింద 1,228 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు అక్కడ కొన్ని భూములు నిరుపయోగంగా మారాయి. యంత్రాలు వాడకుండానే పాడైపోతున్నాయి. పరిశ్రమలు పిచ్చి చెట్లకు ఆవాసాలయ్యాయి.

 

(Courtacy Eenadu)