ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో గౌడియా మఠ ఆశ్రమ నిర్వాహకుడు స్వామి భక్తిభూషణ్ మహరాజ్‌ను ముజఫర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలోని 8 మంది మైనర్ బాలికలపై లైంగిక డాడికి పాల్పడినట్టు భక్తిభూషణ్‌పై ఆరోపణలొచ్చాయి. ఆశ్రమం మేనేజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆశ్రమం నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్ ఆధారంగా జిల్లాకు చెందిన చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు ఈ నెల 8న ఆశ్రమం నుంచి బాలికలను రక్షించారు. బాలికలను వైద్య పరీక్షలకు పంపగా కనీసం నలుగురు చిన్నారులపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది. ఆశ్రమంలో చేరిన బాలికలంతా త్రిపుర, మిజోరంకు చెందినవారు. విద్యార్థులుగా తమ పిల్లలను ఆశ్రమంలో చేర్పించామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికలతో వెట్టి చాకిరీ చేయించినట్టు కూడా ఆశ్రమ నిర్వాహకులపై ఆరోపణలున్నాయి.

Courtesy Mana Telangana