కరోనాతో పిల్లల చదువులకు తీవ్ర అంతరాయం కలిగింది. లాక్డౌన్ నుండి చదువులు లేక పిల్లలు ఎలా తయారవుతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అన్నీ సంస్థలు తగు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ తెరుచుకున్నా.. పాఠశాలలు, కళాశాలలు తెరవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. పిల్లల మీద కరోనా ప్రభావం చాలా తేలిగ్గా పడుతుందని.. కరోనా సోకితే వారు కోలుకోవడం కష్టం అని వైద్యులు చెబుతుండటంతో స్కూళ్లు తెరిచే ఊసును అధికారులు మరిచిపోయారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆగస్ట్ 31వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.  ‘నాడు-నేడు పనులపై జిల్లా కలెక్టర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలన్నారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నాం’ అని జగన్ తెలిపారు.
ఇదిలావుండగా ఏపీలో కరోనా 24 గంటల్లో 62,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏకంగా 7,948 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,10,297కు పెరిగింది. అలాగే మృతుల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. గడచిన 24 గంటల్లో ఏకంగా 58 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 1,148కి చేరింది. ఈలాంటి సమయంలో తల్లి దండ్రులు తమపిల్లలను విద్యాసంస్థలు, బళ్ళు తెరిచినా ఇంట్లోనుండి బడులకు పంపకపోవడమే ఉత్తమం.