•  డీసీపీ పద్మజారెడ్డి
  • ఉప ఎన్నికల కోసమే తరలిస్తున్నారు: డీసీపీ

శామీర్‌పేట రూరల్‌ : శామీర్‌పేట టోల్‌గేట్‌ వద్ద సోమవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ రూ.40లక్షల నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుదేనని బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల కోసమే ఈ డబ్బులు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మంగళవారం శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.

శామీర్‌పేట టోల్‌గేట్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రింగురోడ్డుపై రెండు కార్లలో వేగంగా వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి వెనక్కి మళ్లారు. గమనించిన పోలీసులు వారిని వెంబడించారు. ఓ కారులో నుంచి సంచి పట్టుకొని దిగిన వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని పట్టుకోగా.. సంచిలో రూ.40 లక్షల నగదు ఉంది. ఆరా తీస్తే పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అతనితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విచారించారు. అవి భూ లావాదేవీలకు సంబంధించిన డబ్బులని, తమ సొంతవని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు వారి సెల్‌ఫోన్ల డేటా సాయంతో ద ర్యాప్తు ముమ్మరం చేశారు.

సెల్‌ఫోన్లలో దుబ్బాక బీజే పీ అభ్యర్థి రఘునందన్‌, ఆయన పీఏ సంతో్‌షగౌడ్‌ల నంబర్లు గుర్తించారు. మళ్లీ విచారించగా పట్టుబడిన  నలుగురు భవాణి శ్రీనివా్‌సబాబు, భవాణి ఆంజనేయులు బాబు, మాజీద్‌, సురే్‌ష.. రఘునందన్‌ అభిమానులమని చెప్పారు. డబ్బును తన బంధువులకు అందించాలని రఘునందన్‌ చెప్పినట్టుగా వెల్లడించారని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని డీసీపీ చెప్పారు.

Courtesy Andhrajyothi