హైదరాబాద్‌ : గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితా ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పా టు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబం ధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం.

Courtesy Sakshi…