రెండు రాష్ట్రాల నుంచి 62 మందికి చోటు

హైదరాబాద్‌: ఈ ఏడాదికి గాను విడుదలైన హురున్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 62 మందికి చోటు దక్కింది. అందులో 20 మంది ఫార్మా రంగానికి చెందినవారే. తెలుగు రాష్ట్రాల జాబితాలో దివీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ మురళీ దివి, ఆయన కుటుంబం రూ.49,200 కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచింది. మరిన్ని ముఖ్యాంశాలు..

  1. జాబితాలోని 62 మంది మొత్తం ఆస్తి రూ.2,45,800 కోట్లుగా నమోదైంది.
  2. గడిచిన ఏడాది కాలంలో గ్రాన్యూల్స్‌ ఇండియా చైర్మన్‌ చిగురుపాటి కృష్ణప్రసాద్‌ ఆస్తి 218 శాతం వృద్ధి చెందింది. లారస్‌ ల్యాబ్స్‌ అధిపతి సీ సత్యనారాయణ సంపద 210 శాతం పెరిగింది. దేశీయ జాబితాలోని ధనవంతులందరిలోకెల్లా ఆస్తిలో అత్యధిక వృద్ధి నమోదు చేసుకున్న ఐదుగురిలో వీరిద్దరూ ఉండటం గమనార్హం. ఠ భారత్‌లోని డాలర్‌ బిలియనీర్ల (రూ.7,500 కోట్లు, అంతకు పైగా ఆస్తి కలిగినవారు) జాబితాలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి 9 మందికి చోటు దక్కింది. ఠ ఈ ఏడాది రెండు రాష్ట్రాల నుంచి కొత్తగా 9 మందికి ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. ఠ ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక మహిళ మహిమ దాట్ల.

ఏయే రంగం నుంచి ఎంత మంది?
ఫార్మాస్యూటికల్స్‌ 20
ఫుడ్‌ ప్రాసెసింగ్‌  7
నిర్మాణం, ఇంజనీరింగ్‌ 5
క్యాపిటల్‌ గూడ్స్‌  4
ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ 4