మనువాదుల ఎజెండాలో భాగమే మనిషా హత్య మనువాదులు అంతర్గత జండాలో భాగమనే ఉత్తరప్రదేశ్లో మనిషా హత్య జరిగిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం అన్నారు. ఆ సంఘం గండీడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో లో మనీషా హత్యను నిరసిస్తూ మనీషా హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గండి మండల కేంద్రంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ బిజెపి మనీషా హంతకులకు మద్దతుగా నిలబడిందని విమర్శించారు. అగ్ర కులాలపై దాడులు జరిగితే ఒక తీరు బహుజనుల పైన దాడి జరిగినప్పుడు మరొక తీరుగా ప్రభుత్వాలు స్పందించడం చూస్తే న్యాయం కులం ఆధారంగానే జరుగుతుందని పేర్కొన్నారు.

నలుగురు వ్యక్తులు దారుణానికి తెగబడి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపితే అక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అత్యాచారం జరగలేదని చెప్పడం అన్నారు. హేయమైననా చర్య అన్నారు ఈ ఘటన తర్వాత వరుసగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత మహిళ పరంపర కొనసాగుతుందన్నారు. ఈ తరహాలోనే కోర్టు తీర్పులు వస్తున్నాయని గాంధీ హత్య కేసు ప్రస్తుతం విచారణ జరిగితే గాడ్సే కూడా నిర్దోషి తీర్పు వెలువడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి దాడులను నివారించేందుకు బహుజనులు అంతా పూలే అంబేద్కర్ భావజాలంపై చైతన్యం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం దిశగా సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు మనిషా హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బే గారీ మహేష్ భజన సేన కోసిగి మండల అధ్యక్షుడు మల్కప్ప ఇంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాదిగ గండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె ఎం నారాయణ బాలల హక్కుల పరిరక్షణ జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్ బహుజన భోజన ఉద్యమకారులు రాము రాము ధర్మ గండీడ్  మండల యువజన సంఘం అధ్యక్షులు బోరు కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ sc సెల్ అధ్యక్షుడు కఫ్లాపూర్ ఆశన్న, సాలార్ నగర్ గ్రామ అధ్యక్షులు రాములు అలాగే వెన్నచేడ్ బహుజన నాయకులు వెంకట్ రాములు రాము బాలరాజు రావణ్ మల్లయ్య శ్రీనివాస్ వెంకట్ పసుల శ్రీనివాస్ స్వేరోస్ సర్కిల్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ సత్యమన్న గారు అర్జున్ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గౌడ సంఘం surangal గ్రామం వార్డ్ నెంబర్ అశోక్ గౌడ్ భారత నాస్తిక సమాజం నారాయణపేట జిల్లా అధ్యక్షులు చిన్ని కృష్ణయ్య గౌర గల్లా కృష్ణ మహారాజ్ పేరు సర్కిల్ కార్యదర్శి శాంతి రంగ్యా మాజీ ఎంపీపీ రమేష్ సార్ సల్కరిపేట టీచర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు